📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu News : Air Purifying Plants : గాలిని శుభ్రం చేసే మొక్క‌లు ఏమిటో తెలుసుకుందాం ..

Author Icon By Sudha
Updated: October 21, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్ర‌పంచం రోజు రోజుకీ అన్ని రంగాల్లోనూ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మ‌రో వైపు అంతే వేగంగా కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం అన్ని దేశాల‌ను కాల‌ష్య స‌మ‌స్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా గాలి కాలుష్యం రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో కాలుష్య‌భ‌రిత‌మైన గాలిని పీలుస్తున్న ప్ర‌జ‌లు అనేక ర‌కాల వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం న‌గ‌రాల్లో మాత్ర‌మే ఉండే కాలుష్యం ప్ర‌స్తుతం గ్రామీణ ప్రాంతాల‌కు కూడా విస్త‌రించింది. దీని వల్ల ప్ర‌జ‌ల‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కాలుష్యం లేని స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చుకోవ‌డం క‌ష్టంగా మారింది. అయితే గాలి కాలుష్యాన్ని అరిక‌ట్టాలంటే అందుకు మొక్క‌లను పెంచ‌డం (Air Purifying Plants) ఒక్క‌టే మార్గం. ఈ క్ర‌మంలోనే కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఇంట్లో పెంచ‌డం వ‌ల్ల గాలి కాలుష్యాన్ని తగ్గించుకోవ‌చ్చు. గాలి శుభ్రంగా మారుతుంది. స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చ‌వ‌చ్చు. దీంతో ఎలాంటి రోగాలు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

Read Also: PRIMA: ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు

Air Purifying Plants

బోస్ట‌న్ ఫెర్న్‌, స్పైడ‌ర్ ప్లాంట్‌

బోస్టన్ ఫెర్న్ అనేక మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌చ్చు. ఇది గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి కాలుష్య కార‌కాల‌ను తొల‌గించి గాలిని శుభ్రం(Air Purifying Plants) చేస్తుంది. అలాగే గాలిలో ఉండే బెంజీన్‌, జైలీన్ వంటి స‌మ్మేళ‌నాల‌ను సైతం నిర్మూలిస్తుంది. ఈ మొక్క‌ను ఇంట్లో పెంచుకోవ‌డం చాలా సుల‌భం. దీనికి వారంలో ఒక‌సారి నీటిని పోస్తే చాలు, చాలా సుల‌భంగా పెరుగుతుంది. అలాగే స్పైడ‌ర్ ప్లాంట్ అనే మొక్క‌ను ఇంట్లో పెంచుకుంటున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. ఈ మొక్క గాలిలో ఉండే కాలుష్య కార‌కాల‌ను తొలగించి గాలిని శుభ్రంగా మారుస్తుంది. ఈ మొక్క‌ల‌ను చాలా సుల‌భంగా ఇంట్లో పెంచుకోవచ్చు. వీటి సంర‌క్ష‌ణ కూడా చాలా సుల‌భ‌మే. కిటికీల వ‌ద్ద లేదా ఎండ త‌గిలేలా ఈ మొక్క‌ల‌ను పెంచాల్సి ఉంటుంది. దీంతో ఇవి సుల‌భంగా పెరుగుతాయి.

వీపింగ్ ఫిగ్‌, పీస్ లిల్లీ..

వీపింగ్ ఫిగ్ అనే మొక్క‌ను ఇంట్లో పెంచుకుంటున్నా ఉప‌యోగం ఉంటుంది. ఈ మొక్క‌ల‌ను చ‌క్క‌గా సంర‌క్షిస్తే 2 అడుగుల నుంచి 10 అడుగుల ఎత్తు వ‌ర‌కు పెరుగుతాయి. వీటిని కూడా చాలా సుల‌భంగా పెంచ‌వ‌చ్చు. పెద్ద‌గా స‌మ‌యం కేటాయించాల్సిన ప‌ని కూడా ఉండ‌దు. ఇంట్లో లేదా ఇంటి బ‌య‌ట ఈ మొక్క‌లను పెంచ‌వ‌చ్చు. అయితే సూర్య‌ర‌శ్మి త‌గిలేలా ఈ మొక్క‌ల‌ను పెంచాల్సి ఉంటుంది. ఒక‌సారి ఈ మొక్క‌కు నీటిని పోస్తే పూర్తిగా త‌డి ఆరిపోయే వ‌ర‌కు నీటిని పోయాల్సిన ప‌ని ఉండ‌దు. అందువ‌ల్ల చాలా సుల‌భంగా ఈ మొక్క‌లు పెరుగుతాయి. ఈ మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకుంటే గాలి శుభ్రంగా మారుతుంది. స్వ‌చ్ఛ‌మైన గాలిని పీల్చ‌వ‌చ్చు. అదేవిధంగా గాలిని శుభ్రం చేయ‌డంలో పీస్ లిల్లీ అనే మొక్క కూడా మేలు చేస్తుంది. ఇది కేవ‌లం గాలిని శుభ్రం చేయ‌డం మాత్ర‌మే కాదు, అంద‌మైన పూల‌ను కూడా పూస్తుంది. ఇవి సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతాయి. గాలిలో ఉండే కాలుష్య కార‌కాలు, ఆర్గానిక్ స‌మ్మేళ‌నాల‌ను ఈ మొక్క‌లు తొల‌గిస్తాయి. ఈ మొక్క‌ల‌ను చాలా సుల‌భంగా పెంచ‌వ‌చ్చు.

Air Purifying Plants

ఇంగ్లిష్ ఐవీ

ఇంగ్లిష్ ఐవీ అనే మొక్క కూడా గాలిలో ఉండే కాలుష్య కార‌కాల‌ను తొల‌గించి గాలిని శుభ్రంగా మారుస్తుంది. దీన్ని అలంక‌ర‌ణ కోసం కూడా పెంచుకోవ‌చ్చు. కానీ సూర్య‌ర‌శ్మి త‌గిలేలా ఈ మొక్క‌ను పెంచాల్సి ఉంటుంది. నీళ్ల‌ను త‌ర‌చూ పోయాల్సిన ప‌ని ఉండ‌దు. ఎప్పుడో ఒకసారి నీళ్ల‌ను పోసినా చాలు, చాలా సుల‌భంగా ఈ మొక్క పెరుగుతుంది. ఇలా ఆయా ర‌కాల మొక్క‌లు గాలిని శుభ్రం చేయడంలో ఎంత‌గానో స‌హాయం చేస్తాయి. గాలి కాలుష్యాన్ని తొల‌గిస్తాయి. మ‌నకు స్వ‌చ్ఛ‌మైన గాలిని అందిస్తాయి. శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు రాకుండా ర‌క్షిస్తాయి. అయితే కొన్ని ర‌కాల మొక్క‌లు అల‌ర్జీని క‌లిగించే స్వ‌భావాన్ని కలిగి ఉంటాయి. క‌నుక అల‌ర్జీలు ఉన్న‌వారు లేదా పిల్ల‌లు ఉన్న‌వారు ఈ మొక్క‌ల‌ను ఇంట్లో పెంచుకుంటే జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

ఎయిర్ ప్యూరిఫైయర్ కోసం నాసా ఏ ప్లాంట్ను ఆమోదించింది?

ఒక పీస్ లిల్లీ వేసవి అంతా సువాసనగల పువ్వులను ఉత్పత్తి చేస్తుంది మరియు గాలి నుండి అమ్మోనియా, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోరోబెంజీన్ మరియు బెంజీన్‌లను సమర్థవంతంగా తొలగిస్తుంది. ఇది నీడ ఉన్న ప్రదేశాలలో మరియు నేల తేమగా ఉంచబడినప్పుడు బాగా పెరుగుతుంది. అయితే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ మొక్కను పిల్లలు లేదా పెంపుడు జంతువులు తింటే విషపూరితం కావచ్చు.

గాలిని శుద్ధి చేసే మొక్కలు అలెర్జీని తగ్గిస్తాయి?

చాలా మొక్కలు గాలిలో పుప్పొడిని తక్కువగా లేదా అస్సలు విడుదల చేయవు, మరియు కొన్ని అద్భుతమైన గాలి-శుద్ధి లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి మీకు శుభ్రమైన గాలిని అందిస్తాయి . ఉదాహరణకు, పాము మొక్కలు పుప్పొడిని విడుదల చేయవు మరియు వాటి కత్తి ఆకారపు ఆకులు గాలిలో అలెర్జీ కారకాలను తగ్గించడానికి దుమ్ము మరియు పెంపుడు జంతువుల గాలిని సేకరించడానికి సహాయపడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

air purifying plants Breaking News clean air home plants indoor plants latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.