బరువు తగ్గే సీక్రెట్ టిప్స్!
బరువు తగ్గాలని అనుకునే వారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు జిమ్‌కి వెళ్లి కఠినమైన వ్యాయామాలు చేస్తారు, మరికొందరు ఆహార నియంత్రణ ద్వారా తమ కేలరీలను తగ్గించుకుంటారు. అయితే కొన్ని మార్గాల్లో బరువు తగ్గడమే కాదు, దీర్ఘకాలం పాటు అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యం. మీరు చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటే, ఈ ‘వెయిట్ లాస్ చీట్ కోడ్’లు మీకు ఉపయోగపడతాయి. నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలను పాటిస్తే, ఆరోగ్యంగా, సులభంగా బరువు తగ్గగలుగుతారు.
ఆకలి వేసినప్పుడు ఎప్పుడైనా తినకూడదు!
చాలామంది ఆకలి వేస్తే కంటికి కనిపించినది తినేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరం ఖాళీగా ఉన్నప్పుడే నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు పూర్తిగా ఖాళీ అయ్యాక మాత్రమే తినాలని సూచిస్తున్నారు.
80/20 ఆహార నియమం పాటించాలి
ఆహార నియంత్రణలో 80/20 రూల్ పాటిస్తే బరువు అదుపులో ఉంటుంది. తీసుకునే ఆహారంలో 80% పోషకాహారం ఉండాలి, మిగిలిన 20% తినే ఆహారం నచ్చినట్లుగా ఉండొచ్చు.
భోజనానికి ముందు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి
భోజనం ముందు ఓ గ్లాస్ మంచి నీరు తాగితే, ఆకలి కొంత వరకు తగ్గుతుంది. దీని వల్ల ఎక్కువగా తినకుండా, తక్కువ కేలరీలే శరీరానికి అందుతాయి.
భోజనం తర్వాత నడక తప్పనిసరి
ఆహారం తిన్న వెంటనే మంచానికి వెళ్లిపోవడం వల్ల కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువ. భోజనం అయిన వెంటనే అరగంట నడవడం వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది.
నిద్ర ముందు కనీసం రెండు గంటలు భోజనం చేయకూడదు
అర్ధరాత్రి భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్రకు ముందుగా రెండు గంటలు గ్యాప్ ఇవ్వడం వల్ల, ఆహారం పూర్తిగా జీర్ణమైపోతుంది.
ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి
బరువు తగ్గే ప్రక్రియలో ప్రొటీన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రొటీన్ అధికంగా తీసుకుంటే, కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది.
మొబైల్, టీవీ చూస్తూ తినకూడదు
టీవీ, మొబైల్ చూస్తూ తినడం వల్ల మితిమీరిన ఆహారం తీసుకునే అవకాశం ఉంది. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.
రోజుకు కనీసం 7-8 గంటలు నిద్ర అనివార్యం
తగినంత నిద్ర లేకపోతే శరీరంలో ఆకలిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల అధిక ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఒత్తిడిని తగ్గించుకోండి
అధిక ఒత్తిడికి గురైతే, కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. యోగా, మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
బరువు తగ్గటానికి మందుల వినియోగంపై అవగాహన
కొన్ని మందులు బరువు తగ్గించగలవు, అయితే అవి 20-25% వరకు మాత్రమే ప్రభావం చూపుతాయి. ఈ మందుల ప్రభావం మందగించకుండా మెటాబాలిజమ్ వేగాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి.
అధ్యయనాల ప్రకారం బరువు తగ్గించే ముఖ్యమైన విషయాలు
బరువు తగ్గాలనే క్రమంలో, మరీ తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల శరీరం సరిగ్గా పనిచేయదు. క్రమశిక్షణతో వ్యాయామం, సరైన ఆహారం ద్వారా బరువు తగ్గించుకోవాలి.