ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఈ రోజు ఢిల్లీకి పయనం కానున్నారు. రెండు రోజుల ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి కేంద్రం నుండి మరింత మద్దతు పొందడం లక్ష్యంగా తీసుకున్న చర్యల్లో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రత్యేక ప్రాజెక్టులపై కేంద్రం సహకారం పొందడమే ముఖ్య ఉద్దేశం.
ఏడుగురు కేంద్ర మంత్రులతో ఒకేరోజులో సమావేశాలు
రేపు చంద్రబాబు ఢిల్లీ(Delhi)లో ఏడుగురు కీలక కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం, రోడ్డు ప్రాజెక్టులు, విద్యుత్, నీటి వనరుల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కేంద్రంతో సమన్వయం ద్వారా రాష్ట్రానికి గరిష్ఠ ప్రయోజనాలు అందించాలని సీఎం యత్నిస్తున్నారు.
పెట్టుబడుల కోసం వ్యాపారవేత్తలతో సమావేశం
రాష్ట్రంలో పెట్టుబడులు పెంచే ఉద్దేశంతో చంద్రబాబు ఢిల్లీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ, హైటెక్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వారి సహకారం కోరనున్నారు. ఇదే సందర్భంలో ఈ నెల 24న జరుగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. నెల రోజుల వ్యవధిలో ఇది ఆయన రెండో ఢిల్లీ పర్యటన కావడం గమనార్హం.
Read Also : Chandrababu Naidu : బెంగళూరు ఎయిర్ పోర్టుపై చంద్రబాబు ఏమన్నారంటే…!