📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

TSRTC: తెలంగాణ ఆర్టీసీలో 3 వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం!

Author Icon By Sharanya
Updated: August 17, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)లో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ముఖ్యంగా కండక్టర్ పోస్టు (Conductor post)ల నియామకానికి దాదాపు 12 ఏళ్ల తర్వాత అవకాశం లభించబోతోందని సమాచారం.

TSRTC

3 వేల ఉద్యోగాల్లో తొలి విడతలో 1,500 పోస్టులు

సంస్థలో మొత్తం 3 వేల ఉద్యోగాలను భర్తీ (3 thousand jobs filled)చేయాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, మొదటి విడతలో భాగంగా 1,500 కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ నియామకాల కోసం టీఎస్ఆర్టీసీ (TSRTC) యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

2013 నుంచి కొత్త నియామకాలు లేవు

గత 2013 నుంచి కండక్టర్ల నియామకాలు జరగకపోవడంతో ఇప్పటివరకు తాత్కాలిక సిబ్బందితోనే రవాణా సేవలను కొనసాగిస్తోంది సంస్థ. ప్రతి సంవత్సరం పదవీ విరమణ చేస్తున్న సిబ్బంది సంఖ్య పెరగడంతో, ప్రస్తుతం పని చేస్తున్న వారికి అదనపు పనిభారం ఏర్పడింది.

సంస్థ కార్యకలాపాల కోసం అవసరమైన కొత్త సిబ్బంది

సంస్థ పనితీరును సజావుగా కొనసాగించేందుకు కొత్త సిబ్బంది అవసరం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లతో పాటు ఇతర విభాగాల్లో కలిపి మొత్తం 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలోనే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

నోటిఫికేషన్ త్వరలోనే

ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించబోతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/indian-railways-secunderabad-tirupati-special-trains/telangana/531414/

Breaking News Conductor Posts latest news Telangana jobs Telangana RTC Jobs Telugu News Transport Jobs TSRTC Recruitment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.