తెలంగాణ(TG) గ్రూప్–1 నియామకాల సెలక్షన్ లిస్టుపై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ కేసుపై జనవరి 22న నిర్ణయం వెల్లడించనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. సెలక్షన్ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా, ఈ జాబితాను సింగిల్ బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై స్పందించిన డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఇచ్చిన రద్దు ఉత్తర్వులకు స్టే మంజూరు చేసింది.
అభ్యర్థులు vs కమిషన్ వాదనలు
ఈ కేసును(TG) తాజాగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారించి, ఇరు పక్షాల వాదనలు నమోదు చేసింది. సెలక్ట్ కాకపోయిన అభ్యర్థులు పరీక్ష ప్రక్రియలో పలు లోపాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. దీనికి ప్రతిగా TGPSC, గ్రూప్–1 పరీక్షలు పూర్తిగా నియమావళి ప్రకారమే నిర్వహించామని, ఎలాంటి అక్రమాలు జరగలేదని కోర్టుకు వివరించింది.ఇరు వర్గాల వాదనలు పూర్తవడంతో, హైకోర్టు జనవరి 22న తుది తీర్పు వెలువరించనుంది. ఈ నిర్ణయం వేలాది గ్రూప్–1 అభ్యర్థుల భవితవ్యంపై ప్రభావం చూపనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: