తెలంగాణ (TG లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-3 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.. హైదరాబాదులోని సురవరం ప్రతాప్ రెడ్డి (పొట్టి శ్రీరాములు) యూనివర్సిటీలో నవంబర్ 8 నుంచి 26 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అభ్యర్థులు తమ సర్టిఫికెట్‌లను ధృవీకరించుకోవచ్చు.
Read Also: Jubilee Hills Bypoll Polling : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే !!
1,365 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) (TG) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు శాఖల్లో 1,365 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 రాత పరీక్షలు నిర్వహించింది. రాతపరీక్ష ఫలితాలు విడుదలైన అనంతరం మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇటీవలే ప్రకటించింది.
ఇప్పుడు వారందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దశ మొదలైంది.TGPSC అధికారిక వెబ్‌సైట్ https://tspsc.gov.ఇన్ లో పూర్తి వివరాలు, షెడ్యూల్, అవసరమైన పత్రాల జాబితా అందుబాటులో ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: