📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

SSC Hindi Paper Leak Telangana: ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం.. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్

Author Icon By Anusha
Updated: March 21, 2026 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

SSC Hindi Paper Leak Telangana: తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం విద్యాశాఖలో పెను సంచలనం సృష్టించింది. నిజామాబాద్‌ జిల్లా ఆలూర్‌ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ సంఘన చోటు చేసుకోవడంతో విధుల్లో ఉన్న 9 మంది సిబ్బందిని అధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, పరీక్షా కేంద్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.ఇకపై పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్‌ ఫోన్‌లను ట్రాకింగ్‌ చేసే విధానం తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

Read Also: Moinabad Drugs Case: డ్రగ్స్ కేసులో సంచలనం..అభిషేక్ సింగ్ అరెస్ట్

విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు:

దీంతో పరీక్షా కేంద్రాల్లోకి ఎవరైనా ఫోన్‌ తీసుకొచ్చి స్విచ్‌ ఆఫ్‌ చేసినా గుర్తిస్తామని, పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు నిషేధమని విద్యాశాఖ స్పష్టం చేసింది. తాజా ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల్లో క్లర్క్‌లు, రిజర్వ్‌లో ఉన్న ఇన్విజిలేటర్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మాత్రమే కూర్చొని ఉండాలి. విద్యార్థుల వద్దకు, కారిడార్లలో తిరగరాదని విద్యాశాఖ పేర్కొంది. క్లర్క్‌లుగా పాఠశాల సబ్జెక్టు టీచర్లను నియమించరాదు. తప్పనిసరిగా జూనియర్‌ అసిస్టెంట్లను మాత్రమే నియమించుకోవాలి.

telangana-ssc-hindi-paper-leak-nizamabad-alur-staff-suspended-2026

హాల్‌టికెట్‌ నంబర్లను ప్రశ్నపత్రంలోని అన్ని పేజీలపై తప్పనిసరిగా విద్యార్థులతో రాయించాలని ఆదేశించింది. ప్రైవేట్‌ పాఠశాలల సిబ్బంది పరీక్షాకేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉండరాదు. ప్రతి కేంద్రంలో విద్యార్థుల కోసం క్లోక్‌ రూమ్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలను అతిక్రమించి అక్రమాలకు పాల్పడితే సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని విద్యాశాఖ హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

10th Class Exam Security Tracking Education News Telugu Mobile Phone Ban in Exam Centers Telangana Naveen Nicolas Director School Education Instructions Nizamabad Alur School Paper Leak News Telangana SSC Hindi Paper Leak 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.