SSC Exams: హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి
వార్షిక పరీక్షలకి 5,28,239 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారికి సంబంధించిన హాల్ టికెట్లను గురువారం నుంచే ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు పాఠశాల విద్య డైరక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఎస్ఎస్సి పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను డైరక్టర్ శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ తెలిపారు.
Read Also:Telangana: మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
విద్యార్థులకు జారీ చేసే హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్తో ఉండనుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను పొందడం కోసం 8096958096 వ్యాట్సాప్ నంబర్కి హాయ్ అని టైప్ చేసి వెంటనే ఎస్ఎస్సి హాల్ టికెట్ మార్చి-2026 అని సెండ్ చేస్తే హాల్ టికెట్ను సెండ్ చేయనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వారి పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చని, వారికి ఎంత దూరంలో ఉందో కూడా తెలుస్తుంది. తద్వారా వారు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకునే వెలుసుబాటు కలగనుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఎస్ఎస్సి పరీక్షలకు 5,28,239 మంది పరీక్షలకు హాజరు కానున్నారు.
వారిలో రెగ్యులర్ విద్యార్థులు 5,17,727 మంది విద్యార్థులు కాగా.. 10,512 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరు కానున్నారు. ఎస్ఎస్సి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 1582 ప్రభుత్వ స్కూల్స్ ఉండగా.. 1094 స్కూల్స్ ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 4.70 లక్షల మంది ఉండగా.. తెలుగు మీడియం వారు 44,881 మంది ఉన్నారు. 3720 మంది ఉర్దూ మీడియం విద్యార్థులున్నారు. ఎస్ఎస్ సి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ కార్యాలయంలో 24 గంటలపాటు అందుబాటులో ఉండేలాగా 040-23230942 నంబర్ అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ తెలిపారు. పరీక్షలకు నమోదు చేసుకున్న విద్యార్థుల్లో 5,17,727 రెగ్యులర్ విద్యార్థులున్నారు. వారిలో బాలురు 260916 మంది బాలికలు 256811 మంది ఉన్నారు. 10,512 ఒకసారి విఫలమైనవారు కాగా.. వారిలో బాలురు 7038 మంది బాలికలు 3474 మంది. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా.. వారిలో బాలురు 267954 మంది, బాలికలు 260285 మంది ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: