📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Latest News: AI: కేంద్రం సంచలన నిర్ణయం.. 3వ తరగతి నుంచే విద్యార్థులకు ఏఐ పాఠాలు

Author Icon By Aanusha
Updated: October 13, 2025 • 11:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెక్నాలజీ యుగంలోకి అడుగుపెట్టింది. ప్రతి రంగంలోనూ సాంకేతికతే ఆధిపత్యం చెలాయిస్తోంది. కమ్యూనికేషన్‌ నుంచి విద్య వరకు, ఉద్యోగాల నుంచి వైద్య రంగం వరకు అన్ని విభాగాల్లో టెక్నాలజీ (Technology) ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం, రాబోయే దశాబ్దాల్లో ఈ ప్రభావం మరింత విస్తరించబోతోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం విద్యా రంగంలో ఒక సంస్కరణను ప్రారంభించింది.

Read Also: MP Diamond Discovery: ఒక్క రాత్రిలో అదృష్టం మార్చిన వజ్రం

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం (Central Govt) అలర్ట్ అయింది. స్కూల్ దశ నుంచే విద్యార్థులకు టెక్నాలజీ అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే భవిష్యత్ మొత్తం టెక్నాలజీతో నిండి ఉండటంతో విద్యార్థులను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశంలోని అన్ని పాఠశాలల్లో 3వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (AI) ను పాఠ్యాంశాల్లో తప్పనిసరి బోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (CBSE) అన్ని తరగతులకు ఏఐని అనుసంధానం చేయడానికి ఒక కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తోంది.ఈ ఏఐ బోధనకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ స్పందించారు.

AI

పైగా టీచర్లకు ఇప్పుడు ఆర్టిఫిషియల్

ఈ సరికొత్త నిర్ణయానికి సంబంధించి అతిపెద్ద సవాల్ ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఒక కోటి మందికి పైగా టీచర్లకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) కు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం అనేది పెద్ద సవాల్‌ అని తెలిపారు.

రాబోయే 2, 3 సంవత్సరాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ టెక్నాలజీకి అనుగుణంగా మారేలా వేగంగా ముందుకు సాగాలని వెల్లడించారు.ప్రస్తుతం 18 వేల కంటే ఎక్కువ సీబీఎస్ఈ స్కూళ్లలో 6వ తరగతి నుంచి ఏఐని ఒక నైపుణ్య అంశంగా అందిస్తున్నారు.

దీనికి 15 గంటల మాడ్యూల్ ఉంటుంది. 9 నుంచి 12వ తరగతులకు మాత్రం దీన్ని ఒక ఆప్షనల్‌గా ఉంచారు. 2019లో ఈ కార్యక్రమం ప్రారంభించినపుడు.. ఏఐని ఎంచుకున్న 9-10 తరగతి విద్యార్థులు 15 వేల మంది కాగా.. ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 7.9 లక్షలకు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

3rd class curriculum Artificial intelligence education Breaking News latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.