📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

POLYCET-2025: పాలిసెట్ ఫైనల్ ఫేజ్ లో 18,267 సీట్ల కేటాయింపు

Author Icon By Sharanya
Updated: July 29, 2025 • 10:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

30లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజి నీరింగ్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్-2025 (POLYCET-2025) ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు సోమవారం చేశారు. ఫైనల్ ఫేజ్లో 18,267 మందికి సీట్ల కేటాయింపు చేసినట్టు సాంకేతిక విద్య శాఖ కమిషనర్ శ్రీ దేవసేన (Commissioner Sri Devasena)ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి 30లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచిం చారు. అయితే ఫైనల్ ఫేజ్లో మొదటి విడతలో కంటే తక్కువ సీట్ల కేటాయింపు చేశారు. మొదటి విడతలో 18,984 సీట్ల కేటాయింపు చేయగా ఫైనల్ ఫేజ్లో 18,267 సీట్లను కేటాయించారు. మొదటి విడత కంటే 717 సీట్ల తక్కువ కేటాయింపు చేశారు. మొత్తం సీట్లలో కేవలం 62 శాతం సీట్లు మాత్రమే కేటాయిం చారు. ఈ నెల 23 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ను చేపట్టగా.. 23న స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

24, 25 తేదిల్లో వెబ్ ఆప్షన్లు

ఈ నెల 24న సర్టిఫికెట్ వెరిఫికేషనను నిర్వహించగా 24, 25 తేదిల్లో వెబ్ ఆప్షన్లకి అవకాశమిచ్చారు. సోమవారం సీట్ల కేటాయింపు చేశారు. పాలిసెట్-2025 (POLYCET-2025) కౌన్సెలింగ్ (Counseling) ఫైనల్ ఫేజ్లో 18,267 మందికి సీట్ల కేటాయింపు చేశారు. పాలీసెట్-2025లో 80,949 మంది అర్హత సాధించగా వారిలో మొదటి విడతలో 20,811 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. ఫైనల్ ఫేజ్ లో 9828 ఆప్షన్లు ఇచ్చారు. 18,267 మంది శాతం సీట్లు (62శాతం)కి సీట్లను కేటాయించగా మరో 11,182 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 115 ప్రభుత్వ, ప్రైవేట్ డిప్లమా కాలేజీల్లో 29,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో మొదటి విడతలో 62 కేటాయించారు. 59 ప్రభుత్వ కాలేజీల్లో 14,209 సీట్లు అందుబాటులో ఉంటే వాటిలో 11,455 సీట్లను (82శాతం) కేటాయించారు. 56 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 15,240 సీట్లు అందు బాటులో ఉంటే.. వాటిలో 7188 సీట్లను(47.1 శాతం) కేటాయిం చారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో 728 సీట్లను కేటాయించారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్లో భాగంగా సీటు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి ఈ నెల 30వరకు అవకాశం కల్పించారు.

POLYCET-2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో మొత్తం ఎంతమంది విద్యార్థులకు సీట్లు కేటాయించబడ్డాయి?

ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 18,267 సీట్లు కేటాయించబడ్డాయి. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని మిగిలిన ఖాళీ సీట్లను ఆధారంగా నిర్దేశించబడింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రుణం

Breaking News Final phase counselling latest news POLYCET 2025 polycet final seat allotment POLYCET seat allotment polytechnic Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.