దేశవ్యాప్తంగా MBBS, BDS, AYUSH వంటి UG మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET (UG) 2026కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు మార్చి 8 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ కీలక ప్రవేశ పరీక్షను మే 3న నిర్వహించనుండగా, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు మొత్తం 13 భాషల్లో ప్రశ్నాపత్రం అందుబాటులో ఉంటుంది.
Read Also: PG Admissions: ఏపీ పీజీఈసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజు కేటగిరీ ఆధారంగా భిన్నంగా నిర్ణయించారు. జనరల్ అభ్యర్థులకు ₹1700, EWS మరియు OBC-NCL అభ్యర్థులకు ₹1600, SC, ST, PwBD, థర్డ్ జెండర్ అభ్యర్థులకు ₹1000గా ఫీజు ఉంది. విదేశాల నుంచి పరీక్ష రాసే అభ్యర్థులకు ₹9500గా ఫీజు నిర్ణయించారు.
వైద్య రంగంలో కెరీర్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు NEET అత్యంత కీలక పరీక్షగా భావిస్తారు. మంచి ర్యాంకు సాధిస్తే టాప్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందే అవకాశం ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: