నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అకడమిక్ సెషన్ నుంచి MBBS (NEET UG 2026) సీట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. దీనితో పాటు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కూడా అధికారికంగా ప్రక్రియ మొదలైంది.మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB) ఈ మేరకు ప్రక్రియను ప్రారంభించింది.
Read Also: Vaibhav Suryavanshi: వైభవ్ పై ప్రశంసలు కురిపించిన MP శశి థరూర్
కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం
ప్రతి 10 లక్షల జనాభాకు 100 MBBS (NEET UG 2026) సీట్లు అనే నిష్పత్తిని కాలేజీలు తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 50 సీట్లకు రూ.6.25 లక్షలు + 18% GST అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అర్హత కలిగిన ఆసుపత్రులు, ట్రస్టులు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించవచ్చు. ఈ నిర్ణయాలతో NEET UG 2026 అభ్యర్థులకు మరిన్ని అడ్మిషన్ అవకాశాలు లభించనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: