NEET UG 2026: మే 3న పరీక్ష, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం!

Read Time:  1 min
NEET UG 2026: మే 3న పరీక్ష, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం!
FONT SIZE
GET APP

దేశంలోని అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్(యుజి) వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయస్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ (యుజి)-2026(NEET UG 2026) కొరకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆదివారం నుంచి స్వీకరించడం ప్రారంభించింది. నీట్ యుజి -2026కి సంబంధించిన షెడ్యూలన్ను ఎన్డీఏ ఆదివారం జారీ చేసింది.

Read Also:SSC Board: టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

NEET UG 2026: Exam, applications start on May 3rd!
NEET UG 2026: Exam, applications start on May 3rd!

నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం, 2019లోని సెక్షన్ 14 ప్రకారం, అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశం కోసం నీట్(యుజి)ని నిర్వహిస్తోంది. బిఏఎంఎస్, బియుఎంఎస్, బిఎస్ఎం కోర్సుల్లో యుజిలో ప్రవేశాలను నీట్ లో వచ్చిన మెరిట్ ఆధారంగా భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బిహెచ్ఎంఎస్ కోర్సులో ప్రవేశానికి కూడా నీట్ (యుజి) వర్తిస్తుంది. నీట్ పరీక్షను మే 3న నిర్వహించనున్నారు. పరీక్షను 180 నిమిషాలు (03 గంటలు) పాటు నిర్వహిస్తారు. పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. నీట్(యుజి)- 2026 పరీక్షను 13 భాషల్లో నిర్వహించనున్నారు.

పరీక్షను 13 భాషల్లో

అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషలలో నిర్వహించనున్నారు. దరఖాస్తుల స్వీకరణను ఆదివారం(ఈ నెల8) నుంచి ప్రారంభించగా… మార్చి 8 వరకు స్వీకరించనున్నారు. ఫీజు చెల్లించడానికి మార్చి 8 రాత్రి 11.59 గంటల వరకు అవకాశమిచ్చారు. దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకోవడానికి మార్చి 10 నుంచి 12 వరకు అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజును జనరల్ అభ్యర్థులకు రూ. 1700గా నిర్ణయించగా.. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబిసి(ఎన్సీఎల్) అభ్యర్థులకు 1600గానూ, ఎస్సీ, ఎస్టీ, పిడబ్లూబిడి, థర్డ్ జండర్ అభ్యర్థులకు రూ. 1000గా నిర్ణయించారు. విదేశాల్లో ఉండేవారికి రూ. 9500గా నిర్ణయించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.