తెలంగాణ (Telangana) నిరుద్యోగులకు శుభవార్త అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, త్వరలోనే సమగ్ర జాబ్ క్యాలెండర్ (Job calendar) ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈసారి జాబ్ క్యాలెండర్‌లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, పోలీస్, టీచర్ వంటి విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.
Irrigation Management: సాగునీటి నియంత్రణలో రైతుల పాత్ర పెంపు
తాము కోరుకున్న పోస్టులు రాకపోవడం
ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో కొన్ని పోస్టు (Post) ల విషయంలో ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, కొంతమంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం, మరికొందరికి తాము కోరుకున్న పోస్టులు రాకపోవడం వల్ల జాయిన్ కాకపోవడం వంటి కారణాలతో చాలా పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా కొత్త నియామకాలతో కలిపి ఈసారి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: