JEE Main 2026 Results: జేఈఈ మెయిన్ 2026 ఫలితాల కోసం నిరీక్షిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక అప్‌డేట్ అందింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం ఉదయం ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ (Final Key)ని అధికారికంగా విడుదల చేసింది.
Read Also: AIIMS Recruitment: నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు భారీ అవకాశాలు
నేడే ఫలితాల విడుదల?
షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12న రావాల్సిన ఫలితాలు కొంత ఆలస్యమయ్యాయి. అయితే, ఫిబ్రవరి 16లోపు ఫలితాలను వెల్లడిస్తామని గతంలోనే అధికారులు ప్రకటించిన నేపథ్యంలో, ఫైనల్ కీ విడుదల కావడంతో ఏ క్షణంలోనైనా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
కీని ఎలా చూసుకోవాలి?
అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ సమాధానాలను సరిచూసుకోవచ్చు. ఫైనల్ కీ ఆధారంగానే తుది ర్యాంకులను ఖరారు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రస్తుతం వెబ్‌సైట్‌ను నిశితంగా గమనిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: