📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

QS Rankings 2026: గ్లోబల్ ర్యాంకుల్లో భారత విద్యాసంస్థలు రికార్డు..

Author Icon By Shobha Rani
Updated: June 19, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ ప్రఖ్యాత క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 (QS Rankings 2026) గురువారం విడుదలయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో రికార్డు స్థాయిలో 54 భారతీయ విద్యాసంస్థలు స్థానం దక్కించుకున్నాయి. దేశంలోని విద్యాసంస్థల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (Delhi IIT) (ఐఐటీ ఢిల్లీ) అగ్రస్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా చూస్తే, ఐఐటీ ఢిల్లీ (Delhi IIT) తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకుంది. గతేడాది 150వ స్థానంలో ఉండగా, ఇప్పుడు 123వ స్థానానికి దూసుకెళ్లింది. క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ ఢిల్లీ ఇప్పటివరకు సాధించిన అత్యుత్తమ ర్యాంకు ఇదే కావడం విశేషం.
భారత విద్యా రంగానికి భారీ గౌరవం
ఈ ఘనతపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ… “భారత ఉన్నత విద్యాసంస్థలు క్యూఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో అపూర్వమైన వృద్ధిని సాధించాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ సంస్థలు ప్రపంచ వేదికపై తమ స్థానాన్ని సంపాదించుకున్నాయి. గత దశాబ్ద కాలంలో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ (QS Rankings 2026) ర్యాంకింగ్స్‌లో భారత్ 390 శాతం అద్భుతమైన వృద్ధిని న‌మోదు చేసింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీ20 దేశంగా అవతరించింది” అని పేర్కొంది.
ఐఐటీ ఢిల్లీ – దేశంలో టాప్ ర్యాంక్
గతేడాది ర్యాంకింగ్స్‌లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఐఐటీ బాంబే, ఈసారి ఐఐటీ ఢిల్లీ తర్వాతి స్థానంలో నిలిచింది. 2025 ర్యాంకింగ్స్‌లో 118వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే, ఈ ఏడాది 129వ స్థానానికి పడిపోయింది. మరోవైపు ఐఐటీ మద్రాస్ తన పనితీరును మెరుగుపరుచుకుంది. 2025లో 227వ ర్యాంకు నుంచి ఏకంగా 47 స్థానాలు ఎగబాకి, 180వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
8 కొత్త సంస్థలు ఈ ఏడాది జాబితాలో..
ఈసారి క్యూఎస్ ర్యాంకింగ్స్ (QS Rankings) జాబితాలో ఎనిమిది భారతీయ విద్యాసంస్థలు కొత్తగా ప్రవేశించడం గమనార్హం. ఏ ఇతర దేశం నుంచి కూడా ఇన్ని కొత్త సంస్థలు ఈ జాబితాలో చేరలేదు. ఈ తాజా ర్యాంకింగ్స్‌తో అమెరికా, బ్రిట‌న్, చైనా తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఈ ఏడాది ర్యాంకులు పొందిన భారతీయ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 48 శాతం తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాయి. ఉద్యోగ కల్పనలో ఖ్యాతి (ఎంప్లాయర్ రెప్యుటేషన్) విషయంలో ప్రపంచంలోని టాప్ 100 సంస్థల్లో ఐదు భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి.

QS Rankings 2026: గ్లోబల్ ర్యాంకుల్లో భారత విద్యాసంస్థలు రికార్డు..

కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య:
ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “2014లో కేవలం 11 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ జాబితాలో ఉండగా, తాజా ర్యాంకింగ్స్‌లో ఆ సంఖ్య 54కు చేరింది. గత దశాబ్దంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలకు నిదర్శనం. నూతన విద్యా విధానం 2020 (ఎన్‌ఈపీ 2020) మన విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చడమే కాకుండా, విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది” అని అన్నారు.
ప్రపంచ టాప్ యూనివర్సిటీలు
ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో స్థానం సంపాదించిన ఇతర ప్రముఖ భారతీయ విద్యాసంస్థల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ (215వ ర్యాంకు), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) బెంగళూరు (219వ ర్యాంకు), ఢిల్లీ యూనివర్సిటీ (328వ ర్యాంకు) ఉన్నాయి. వీటితో పాటు బిట్స్ పిలానీ (668వ ర్యాంకు), ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వంటి ప్రైవేటు సంస్థలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇదిలాఉంటే… ప్రపంచ జాబితాలో అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వరుసగా 14వ ఏడాది కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారత్ ధ్వజం ఎగురవేసింది

ఈ ఏడాది QS ర్యాంకింగ్స్ భారత్‌కు విద్యారంగంలో గ్లోబల్ గుర్తింపు తెచ్చాయి. భారత విద్యాసంస్థలు కేవలం స్థానం సంపాదించడమే కాదు, నాణ్యతా విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలు వంటి అంశాల్లోనూ గణనీయ పురోగతిని సాధిస్తున్నాయి. ఇది భారత విద్యావ్యవస్థ గ్లోబల్ మార్గదర్శకంగా ఎదుగుతున్న సంకేతం.

Read Also: NEET UG 2025: నీట్ యూజీ-2025 రిజల్ట్స్ విడుదల

Breaking News in Telugu GlobalEducation Google news Google News in Telugu IITDelhi Indian educational institutions set a IndianUniversities Latest News in Telugu Paper Telugu News QSRankings2026 record in global rankings. Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.