గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఐఐటీ గువాహటి విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్లు కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
Read Also:APInterExams: ఓపెన్ స్కూల్ ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల
అభ్యర్థులు తమ ఎన్రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రం, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేట్ ఆన్‌లైన్ పరీక్షలు ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించగా, మొత్తం 30 టెస్ట్ పేపర్లకు పరీక్షలు జరిగాయి. ప్రొవిజినల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను అభ్యర్థుల నుంచి స్వీకరించి నిపుణుల ద్వారా పరిశీలిస్తారు. అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి ఫలితాలను ప్రకటిస్తారు. GATE 2026 ఫలితాలను మార్చి 19న విడుదల చేయనున్నట్లు ఐఐటీ గువాహటి వెల్లడించింది.
GATE పరీక్ష దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, టెక్నాలజీ, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ వంటి విభాగాల్లో నిర్వహించే ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పరీక్ష. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐఐటీలు సహా ప్రముఖ విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తాయి. ఇదే సమయంలో తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (TOSS) పరిధిలో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ఉదయం, సాయంత్రం సెషన్లలో పరీక్షలు జరగనున్నాయని, ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: