News Telugu: DRDO: లక్షన్నర జీతాలతో డీఆర్‌డీఓలో భారీగా ఉద్యోగాలు

Read Time:  1 min
Huge number of jobs in DRDO
Huge number of jobs in DRDO
FONT SIZE
GET APP

డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (DRDO) సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్‌ (CEPTAM) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ, మొత్తం 764 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

Read also: CAT 2025: నేడే దేశవ్యాప్తంగా పరీక్ష – మూడు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానం

డిసెంబర్ 9, 2025 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హతలు, ఎంపిక విధానం, ఎగ్జామ్ ప్యాటర్న్ వంటి పూర్తి వివరాలు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ ద్వారా వెల్లడించనున్నారు.

Huge number of jobs in DRDO

Huge number of jobs in DRDO

పోస్టుల వివరాలు

  • Senior Technical Assistant-B: 561 పోస్టులు
  • Technician-A: 203 పోస్టులు

ఎంపికయ్యే పోస్టు ఆధారంగా జీతం నెలకు భారీగా అందనుంది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులకు ₹35,400 – ₹1,12,400, టెక్నీషియన్-A పోస్టులకు ₹19,900 – ₹63,200 మధ్య జీతం లభిస్తుంది.

అభ్యర్థుల వయస్సు 18–28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలను త్వరలో CEPTAM అధికారిక వెబ్‌సైట్‌లో అప్డేట్ చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.