CUETPG2026: పరీక్షల షెడ్యూల్ విడుదల

Read Time:  1 min
CUETPG2026
CUETPG2026
FONT SIZE
GET APP

కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే CUET PG 2026 పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం మార్చి 6 నుంచి మార్చి 27 వరకు దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 15 రోజుల్లో 43 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Read Also: JEE Main 2026 final key: జేఈఈ మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల

CUETPG2026

మూడు షిఫ్టుల్లో పరీక్షల నిర్వహణ
ప్రతి రోజు మూడు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి.

  • మొదటి షిఫ్ట్: ఉదయం 9:00 నుంచి 10:30 వరకు
  • రెండో షిఫ్ట్: మధ్యాహ్నం 12:30 నుంచి 2:00 వరకు
  • మూడో షిఫ్ట్: సాయంత్రం 4:00 నుంచి 5:30 వరకు

మొదటి రోజు పరీక్షల వివరాలు
మార్చి 6న మొదటి రోజు మొదటి షిఫ్ట్‌లో యోగా (COQP21) పరీక్ష జరుగుతుంది. రెండో షిఫ్ట్‌లో స్పోర్ట్స్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్, బయోమెకానిక్స్, సంస్కృతం, ఉర్దూ, టెక్స్‌టైల్ డిజైన్ వంటి సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి రోజు మూడో షిఫ్ట్‌లో పరీక్షలు ఉండవు. మార్చి 7 నుంచి రోజుకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు కొనసాగుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.