CUET UG 2026: సీయూఈటీ యూజీ 2026కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో కీలక అప్‌డేట్ ప్రకటించింది. ఇప్పటికే ఫిబ్రవరి 4తో ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ముగిసినప్పటికీ, విద్యార్థుల అభ్యర్థనల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరోసారి ప్రారంభించింది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
Read also:TG EdCET 2026: షెడ్యూల్ విడుదల: మే 12న ఎంట్రన్స్ పరీక్ష
అప్లికేషన్ ఫీజుతో దరఖాస్తు – సవరణకు అవకాశం లేదు
ఈసారి అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉండదని ఎన్టీయే స్పష్టం చేసింది. అందువల్ల ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించాలని సూచించింది.
సీయూఈటీ యూజీ పరీక్షలు మే 11 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యాసంవత్సరానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా ఇతర విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో, 37 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది.
ఆలస్య రుసుముతో మే 26 వరకు దరఖాస్తు అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TG PGECET 2026 నోటిఫికేషన్‌ను జేఎన్టీయూహెచ్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. మే 6 వరకు ఆలస్య రుసుము లేకుండా అప్లై చేయవచ్చు. రూ.10,000 ఆలస్య రుసుముతో మే 26 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. TG PGECET రాత పరీక్షలు మే 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు కన్వీనర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: