దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT 2026) ఫలితాలు రేపు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.in ద్వారా తమ స్కోర్ కార్డులను పొందవచ్చు.
Read Also: MAT 2025 Exam: ఆన్‌లైన్ రాత పరీక్షకు ఈరోజే చివరి తేదీ
డిసెంబర్ 7న జరిగిన CLAT–2026 పరీక్షకు సుమారు 92 వేల మంది విద్యార్థులు హాజరుకావడం విశేషం. లా విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షగా CLATకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో భారీ ఆసక్తి ఉంటుంది.
ఈ ఫలితాల ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులకు నేషనల్ లా స్కూల్స్, నేషనల్ లా యూనివర్సిటీల్లో అండర్‌గ్రాడ్యుయేట్ (UG) మరియు పోస్ట్‌గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల్లో సీట్ల కేటాయింపు జరగనుంది. ర్యాంకుల ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి, దశలవారీగా సీట్లు కేటాయించనున్నారు. CLATలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా విద్యార్థులకు దేశంలోని ప్రముఖ లా యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. దీంతో పాటు కార్పొరేట్ లా, న్యాయవ్యవస్థ, సివిల్ సర్వీసులు వంటి రంగాల్లో భవిష్యత్తు అవకాశాలు మరింత విస్తరిస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :