సీబీఎస్ఈ బోర్డు పరీక్షల ఫైనల్ టైమ్‌టేబుల్ విడుదల
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Exam) పాఠశాలల్లో(School) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి మరియు 12వ తరగతి బోర్డు పరీక్షల తుది తేదీ పట్టిక విడుదలైంది. హైదరాబాద్‌లో అక్టోబర్ 31న విడుదలైన ఈ షెడ్యూల్ ప్రకారం, బోర్డు పరీక్షలు 2026 ఫిబ్రవరి 17న ప్రారంభమవుతాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9 వరకు కొనసాగనున్నాయని సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భారద్వాజ్ ప్రకటించారు.
ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించబడతాయి. విద్యార్థులు పరీక్షలకు సమయానికి హాజరుకావాలని, సెంటర్ల వద్ద అనుసరించవలసిన మార్గదర్శకాలు త్వరలో ప్రకటించనున్నట్లు బోర్డు పేర్కొంది.
Read also: ఢిల్లీలో వాయు కాలుష్యం .. 75 శాతం కుటుంబాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు..
110 రోజుల ముందే షెడ్యూల్ విడుదల విద్యార్థులకు అదనపు సమయం
సీబీఎస్ఈ(CBSE Exam) గత నెలలోనే తాత్కాలిక డేట్‌షీట్ విడుదల చేసింది. అయితే పాఠశాలలు తమ విద్యార్థుల లిస్ట్ ఆఫ్ కాండిడేట్స్ వివరాలు సమర్పించడంతో, ఆ వివరాల ఆధారంగా బోర్డు ఇప్పుడు ఫైనల్ టైమ్‌టేబుల్‌ను 110 రోజుల ముందుగానే విడుదల చేసింది. ఇది ఇప్పటివరకు ఎన్నడూ జరగని రికార్డ్‌గా నిలిచింది. ఈ సారి షెడ్యూల్‌ను విద్యార్థుల సన్నద్ధత దృష్ట్యా రూపొందించినట్లు అధికారులు తెలిపారు. రెండు సబ్జెక్టుల మధ్య తగిన విరామం ఉండేలా ప్రణాళిక వేసి, విద్యార్థులు ప్రశాంతంగా తయారవడానికి అవకాశం కల్పించారు. సీబీఎస్ఈ పాఠశాలలు ఇప్పటికే రివిజన్ పరీక్షలు, మాక్ టెస్ట్‌లు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఇక 12వ తరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, బోర్డు ప్రవేశ పరీక్షల Entrance Exams షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ తేదీలను నిర్ణయించింది. గతంలో కంటే ఈసారి బోర్డు పరీక్షలు కొంత ముందుగానే ముగుస్తాయి. దీంతో విద్యార్థులు బోర్డు మరియు ప్రవేశ పరీక్షల మధ్య సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: