విజయవాడ APPSC : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు APPSC శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 80 పోస్టుల భర్తీకి త్వరలోనే 20 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు కమిషన్ కార్యదర్శి పి. రాజాబాబు తెలిపారు. ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్లు విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటంతో, అన్ని ప్రకటనలకు కలిపి Common Examination నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
గ్రూప్-1 & గ్రూప్-2 ఫలితాల జాప్యం పై స్పష్టత
గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు ఆలస్యమైన కారణంపై రాజాబాబు స్పష్టత ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల తుది జాబితా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) నుంచి అందకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ఆ జాబితా అందిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రూప్-2 పరీక్షకు సంబంధించి 1,634 మంది అభ్యర్థుల కంటి చూపు, 24 మంది వినికిడి సామర్థ్యానికి సంబంధించిన వైద్య నివేదికలు రావాల్సి ఉందని వివరించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.
ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ నియామకాలు
అటవీ శాఖ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 7న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 287 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు OMR షీట్ నింపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, వైట్నర్ వాడినా లేదా సమాధానాలు చెరిపివేసినా ఆ పత్రాలు పరిగణనలోకి తీసుకోబోమని హెచ్చరించారు. అలాగే ప్రతి మూడు తప్పు సమాధానాలకు ఒక నెగటివ్ మార్కు ఉంటుందని స్పష్టం చేశారు.
APPSC ఈ నెలలో ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనుంది?
సుమారు 80 పోస్టుల భర్తీకి 20 నోటిఫికేషన్లు ఇవ్వనుంది.
గ్రూప్-1 & గ్రూప్-2 ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?
స్పోర్ట్స్ కోటా తుది జాబితా అందిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని APPSC తెలిపింది.
Read hindi news : hindi.vaartha.com
Read also :