కేంద్ర ప్రభుత్వ రంగంలో అతి పెద్ద బ్యాంక్‌గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరోసారి నిరుద్యోగ యువతకు మంచి అవకాశాన్ని అందిస్తోంది. బ్యాంక్ వ్యాపార విస్తరణ, ఖాతాదారుల సేవల బలోపేతంతో పాటు శాఖల్లో మానవ వనరుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భారీగా ఉద్యోగాల భర్తీకి ముందుకొచ్చింది. ఈ క్రమంలో రాబోయే ఐదు నెలల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులను భర్తీ చేయనున్నట్లు SBI ప్రకటించడం యువతలో కొత్త ఆశలను నింపింది.
Read Also: AP: ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే చివరి తేదీ
ఈ విషయాన్ని ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (HR) కిశోర్ కుమార్ పోలుదాసు వెల్లడించారు. ఇప్పటికే ఈ ఏడాది జూన్ నెలలో 505 PO పోస్టుల నియామకాలు పూర్తి చేసినట్లు గుర్తుచేశారు.మొత్తం మూడు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు అవసరాల మేరకు ఆఫీసర్లు, క్లరికల్ కేడర్‌లలో కలిపి మొత్తం 18,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి (Challa Srinivasulu Shetty) గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగానే తాజా పీవో నియామకాలు జరుగుతున్నాయి.మరోవైపు, మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఐటీ,
యువతకు ఇదే అవకాశం
సైబర్ సెక్యూరిటీ విభాగాలను బలోపేతం చేయడంపై కూడా ఎస్‌బీఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 1,300 మంది నిపుణులను నియమించుకుంది. తాజా నియామకాలతో బ్యాంకు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కావాలని చూస్తున్న వారికి ఇది సువర్ణావకాశం అని చెప్పవచ్చు. ఈ నియామక ప్రక్రియలో పోటీ కఠినంగా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ముందుగానే ప్రిపరేషన్‌ను ప్రారంభించడం మంచిది. రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ వంటి విభాగాల్లో సాధన పెంచుకోవాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: