📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Gold Rates: బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయా?

Author Icon By Vanipushpa
Updated: July 12, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయా?
దేశంలో గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు(Gold Rates) మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయం(International)గా నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. జూలై 12 తేదీ గురువారం బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 77 రూపాయిలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,977 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 65 రూపాయిలు పెరిగి 9,140 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 54 రూపాయిలు పెరిగి రూ.7,479 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 7,100 పెరిగి రూ. 9,97,100 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.6,500 పెరిగి రూ. 9,14,00 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ. 5,400 పెరిగి రూ. 7, 47,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold Rates: బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయా?

బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం?
ఇక . చైనా కనుక ఓ కీలక నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో బంగారం ధర రూ. 30 వేల వరకు తగ్గుతుందని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చైనా వద్ద అపారమైన బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే అదే సమయంలో ఆర్థిక సంక్షోభం కూడా చైనాను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి తన వద్ద ఉన్న బంగారాన్ని బహిరంగ మార్కెట్లో వేలానికి పెడితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనా తీసుకునే ఈ ఒక్క నిర్ణయం వల్ల బంగారం ధర రూ. 30,000 తగ్గుతుందనే వాదన అందరికీ అతిశయోక్తి కావచ్చు. అయితే మార్కెట్లో చైనా చర్యలు బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలవు. ప్రపంచ బంగారు మార్కెట్లో చైనా ప్రధాన పాత్ర పోషిస్తోంది.దిగుమతి కోటాల్లో మార్పులు లేదా ప్రభుత్వ విధానాలు వంటి దాని చర్యలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.అమెరికా – చైనా మధ్య వాణిజ్య ఒప్పందం బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. వాణిజ్య చర్చల నుండి వచ్చే సానుకూల సంకేతాలు పెట్టుబడిదారుల భయాన్ని తగ్గిస్తాయి. సురక్షితమైన ఆస్తిగా బంగారం ఆకర్షణను తగ్గిస్తాయి. ఇది ధర తగ్గుదలకు దారితీస్తుంది.

25 వేల నుంచి 35 వేల వరకు బంగారం ధరలు

బంగారం ధరలను గతేదాడి నుంచి మనం చూసుకున్నట్లయితే 75 వేల నుంచి 95 వేల వరకు చేరుకుంది. ఏడాది కాలంలోనే 25 వేల నుంచి 35 వేల వరకు బంగారం ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడానికి చైనానే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే గడిచిన పదేళ్లలో చైనా విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేసింది. ఎక్కువగా తన పెట్టుబడులను బంగారం రూపంలో నిల్వ చేసుకునేందుకే ఆసక్తి చూపింది. అమెరికా డాలర్ మీద ఆధారపడకుండా ఉండేందుకు చైనా ఇలా బంగారాన్ని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు .

బంగారం మనకు ఏమి ఇస్తుంది?
దీనిని దంతవైద్యం మరియు వైద్యంలో, ఆభరణాలు మరియు కళలలో, పతకాలు మరియు నాణేలలో, విలువ నిల్వగా కడ్డీలలో, శాస్త్రీయ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ఉపయోగిస్తారు.

బంగారంపై కొన్ని పంక్తులు ఏమిటి?
బంగారం | వాస్తవాలు, లక్షణాలు & ఉపయోగాలు | బ్రిటానికా
అన్ని లోహాలలో బంగారం అత్యంత సాంద్రత కలిగిన లోహాలలో ఒకటి. ఇది వేడి మరియు విద్యుత్తు యొక్క మంచి వాహకం. ఇది మృదువైనది మరియు మూలకాలలో అత్యంత సాగేది మరియు సాగేది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Raja Singh: రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ హైకమాండ్ ఆమోదం..

#telugu News Gold Market Analysis gold price forecast gold rate drop Investment Trends

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.