ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న WhatsApp త్వరలో ఒక కీలక మార్పుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ యాప్, ఇకపై కొన్ని ప్రత్యేక ఫీచర్ల కోసం Paid Subscription ప్లాన్ తీసుకురానున్నట్లు టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మార్పు వల్ల సాధారణ యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. డబ్బులు చెల్లించకపోయినా WhatsApp ఉచిత వెర్షన్ యథావిధిగా కొనసాగుతుంది. అయితే, అదనపు సౌకర్యాలు కావాలనుకునే వారికి మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ప్రొఫెషనల్ మరియు పవర్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్నట్లు సమాచారం.
Read also: Market Impact: బంగారం–వెండి ధరల్లో భారీ తగ్గుదలకి కారణం ఇతడే!
A new paid plan from WhatsApp
Paid Plan లో లభించే ముఖ్యమైన ఫీచర్లు
టెక్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, ఈ Paid ప్లాన్‌లో ప్రత్యేకమైన కస్టమైజేషన్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కేవలం మూడు చాట్స్ మాత్రమే పిన్ చేయగలుగుతున్నాము, కానీ ఈ ప్లాన్‌తో మరిన్ని చాట్స్‌ను పిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే WhatsApp యాప్ ఐకాన్ రంగు లేదా డిజైన్‌ను మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ఉచిత వెర్షన్‌లో లేని స్పెషల్ థీమ్స్, స్టిక్కర్లు, చాట్ రింగ్‌టోన్స్ కూడా Paid యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని దేశాల్లో స్టేటస్ అప్‌డేట్స్‌లో యాడ్స్ లేకుండా చూడాలంటే కూడా ఈ ప్లాన్ అవసరం కావచ్చు.
యూజర్లపై ప్రభావం
కొత్త ఫీచర్లతో పాటు WhatsApp భద్రతపై కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మెసేజ్‌లు End-to-End Encryption అని కంపెనీ చెబుతున్నా, అమెరికాలో కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపణలు చేయడంతో విచారణలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో, ఈ Paid ప్లాన్ కోసం Waitlist Systemను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఫీచర్లు అందుబాటులోకి రాగానే ముందుగా తెలుసుకోవాలనుకునే వారు ఇందులో నమోదు చేసుకోవచ్చు. ధర, లాంచ్ డేట్ వంటి వివరాలను Meta ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినా, ఇది WhatsApp చరిత్రలోనే పెద్ద మార్పుగా నిలవనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: