हिन्दी | Epaper
సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Latest News: Sundar Pichai: ‘Vibe Coding’ సుందర్ పిచాయ్ ఏమంటున్నారంటే?

Anusha
Latest News: Sundar Pichai: ‘Vibe Coding’ సుందర్ పిచాయ్ ఏమంటున్నారంటే?

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు, వ్యాపారాలు, వైద్య రంగం, విద్యా రంగం ఇలా ప్రతి విభాగంలోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సాంప్రదాయ కోడింగ్ పక్కకు పోయి అధునాతన ప్రోగ్రామింగ్ విధానం అయిన ‘వైబ్ కోడింగ్‌’ (Vibe Coding) అందుబాటులోకి వచ్చిందని గురించి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

Read Also: TATA Group: భారీ విరాళాన్ని బీజేపీకి ఇచ్చిన టాటా గ్రూప్

గూగుల్ ఫర్ డెవలపర్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. కృత్రిమ మేధ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) అన్నారు.

ముఖ్యంగా ఇంజనీరింగ్ నేపథ్యం లేని వ్యక్తులు కూడా ఇప్పుడు తమ ఆలోచనలను కేవలం వివరించడం ద్వారా AI -ఆధారిత టూల్స్ సహాయంతో యాప్‌లను రూపొందిస్తున్నారని తెలిపారు. దీనితో యాప్ డెవలప్‌మెంట్ ప్రక్రియ చాలా ఈజీగా, సరళంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

భద్రత విషయం

ఇంటర్నెట్ మొదలైన రోజుల్లో రచయితలు బ్లాగింగ్‌ను తమ వృత్తిగా ఎలా మార్చుకోగలిగారో అలాగే ఇప్పుడు వైబ్ కోడింగ్ కూడా కొత్త ఉపాధి మార్గాలను, సృజనాత్మక అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ కొత్త విధానం సరదాగా, సులభంగా ఉన్నప్పటికీ.. కొన్ని సమస్యలను, ముఖ్యంగా భద్రత విషయంలో ప్రమాదాలను కూడా తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

వైబ్ కోడింగ్ సరదాగా ఉన్నప్పటికీ ఈ విధానం ఇంకా సంక్లిష్టమైన లేదా అత్యంత సున్నితమైన సాఫ్ట్‌వేర్ నిర్మాణానికి సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. ” ఇటువంటి టూల్స్ ద్వారా రూపొందించబడిన కోడ్‌లో మన సమాచారానికి లేదా డేటాకు భద్రత ఉంటుందని హామీ ఇవ్వడం కష్టం.

What does Sundar Pichai mean by 'Vibe Coding'?
What does Sundar Pichai mean by ‘Vibe Coding’?

వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?

అందువల్ల డేటా సేఫ్టీ అవసరమయ్యే కీలక రంగాలలో మానవ నిపుణుల ప్రమేయం తప్పనిసరి” అని ఆయన అన్నారు. అలాగే మున్ముందు వచ్చే రోజుల్లో ఈ టెక్నాలజీలు మరింత పరివర్తన చెందుతాయని, వాటిని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఏమి సృష్టిస్తారోనని తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పిచాయ్ తెలిపారు.

వైబ్ కోడింగ్ (Vibe Coding) అనేది అధునాతన ప్రోగ్రామింగ్ విధానం. ఇది సాంప్రదాయ పద్ధతుల మాదిరిగా సంక్లిష్ట ప్రోగ్రామింగ్ భాషలపై ఆధారపడదు. కోడింగ్ రానివాళ్లు కూడా చేయగలిగే కోడింగ్ ఇది.

రెగ్యులర్ లాంగ్వేజ్ : ఇది సాధారణ ఇంగ్లిష్.. అలాగే AI అసిస్టెడ్ టూల్స్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ప్రాంప్ట్ బేస్డ్ : యూజర్ తమకేం కావాలో వివరంగా, సరళంగా వివరించగలిగితే చాలు. AI టూల్స్: AI టూల్స్ ఈ సాధారణ వివరణలను ఫంక్షనల్ కోడ్ ప్రాంప్ట్‌ల రూపంలోకి మారుస్తాయి.

ఆటోమేషన్: ఈ సహాయంతో ఎవరైనా లోతైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే యాప్‌లను సృష్టించుకోవచ్చు. రోజువారీ పనులను ఆటోమేట్ చేయవచ్చు లేదా వెబ్‌సైట్లను రూపొందించుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870