ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టాటా (Tata) కంపెనీ తక్కువ ధరలో కొత్త టూవీలర్ వాహనాలను విడుదల చేయబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని టాటా మోటార్స్ స్పష్టతనిచ్చింది.
Read Also: Indian Generic Medicine : చైనాకు భారత జనరిక్ మెడిసిన్!
టాటా అధికారిక స్పష్టత
సదరు కంపెనీ 125సీసీ బైక్‌ను రూ.60వేలకే అందిస్తోందని, ఇది 90కి.మీ మైలేజీ ఇస్తోందంటూ ఇటీవల కొన్ని వెబ్‌సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో టాటా (Tata) క్లారిటీ ఇచ్చింది. అలాంటి మోసపూరిత యాడ్స్‌ను నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది. తమ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే పరిశీలించాలని కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: