📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News Telugu: Visakhapatnam: నారా లోకేశ్ ప్రారంభించిన కొత్త డేటా సెంటర్..

Author Icon By Rajitha
Updated: October 12, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం Visakhapatnam మరో దశలో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థను ఆహ్వానిస్తోంది. భారతదేశంలోని ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ (Data centre) మరియు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ విశాఖలో (Visakhapatnam) ఏర్పాటు చేయడానికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రం భీమిలి నియోజకవర్గం రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్లో హిల్ నెంబర్ 3 వద్ద సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ 50 మెగావాట్ల సామర్థ్యంతో, రెండు దశల్లో రూ.1,500 కోట్ల పెట్టుబడి తో అభివృద్ధి చేయనుంది.

AP Weather Alert:– వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

Visakhapatnam

మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం

మంత్రికి మధురవాడ ఐటీ పార్క్ లో నిర్వాహకులు మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఐ డేటా సెంటర్ మరియు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు.

విశాఖ – గ్లోబల్ డిజిటల్ గేట్‌ వేగా

మంత్రి లోకేశ్ (Lokesh) ప్రకారం, ఈ ప్రాజెక్ట్ విశాఖను గ్లోబల్ డిజిటల్ గేట్‌ వేగా రూపుదిద్దిస్తుందని తెలిపారు. సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని చెప్పారు. Visakhapatnam దీని ద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

అధికారుల హాజరు

కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, (Velagapudi Ramakrishna Babu) పెన్మత్మ విష్ణుకుమార్ రాజు, పి. గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు పీవీఎన్ మాధవ్, గంటా రవితేజ, సీఫీ చైర్మన్ రాజు వేగేశ్న, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ హర్షా రామ్, రాజేష్ తిరుమల రాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఐటీ, ఈ శాఖల సెక్రటరీ కాటంనేని భాస్కర్, విశాఖ కలెక్టర్ హరీంద్రప్రసాద్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AI Edge Data Center latest news Nara Lokesh Telugu News visakhapatnam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.