వీసాల రద్దుపై కోర్టును ఆశ్రయించిన విదేశీ విద్యార్థులు – అమెరికా నిర్ణయంపై భయాందోళన
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు ఎదురైన అసాధారణ సమస్య ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. విదేశీ విద్యార్థుల Visa రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు అకస్మాత్తుగా రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, పలువురు విద్యార్థులు అమెరికాలో కోర్టును ఆశ్రయించారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రఖ్యాత ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, మేరీల్యాండ్, ఒహియో స్టేట్ వంటి ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదువుతున్న విదేశీ విద్యార్థులూ ఈ చర్యపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా Visa రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు రద్దు కావడంతో చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని, తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయిందని వారు పేర్కొన్నారు.ట్రంప్ సర్కార్ కొన్ని Visa రద్దుపై కోర్టుకు వెళ్తున్న విదేశీ విద్యార్థులు హమాస్‌కు మద్దతుగా జరిగిన క్యాంపస్ ఆందోళనల్లో పాల్గొన్నారన్న కారణంతో రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆందోళనల్లో పాల్గొననివారి వీసాలూ రద్దవడంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కొందరిని ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినందుకు వీసాలు రద్దు చేశామన్నారు. మరికొందరికి అసలు కారణం కూడా చెప్పకుండానే వీసా రద్దు చేశారని విద్యార్థులు కోర్టులో విన్నవించారు. ఇలాంటి చర్యలు చట్టపరంగా సరైనవి కావని, ప్రభుత్వానికి ఇంత అధికారం లేదని విద్యార్థుల వాదన.ఇక అమెరికాలో చదువుకోాలంటే విదేశీ విద్యార్థులు సాధారణంగా ఎఫ్1 వీసా తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాలోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన తరువాత, విద్యార్థులు అమెరికన్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. అన్ని అర్హతలు నెరవేర్చిన విద్యార్థులకు ఇంటర్వ్యూలో విజయం సాధించిన తరువాతే వీసా మంజూరవుతుంది. విద్యార్థికి అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయని నిరూపించాలి, అలాగే మెరుగైన విద్యా ఫలితాలు ఉండాలి. వీటన్నింటిని పరిశీలించే బాధ్యత స్టేట్ డిపార్ట్మెంట్‌దే. విద్యార్థి అమెరికాలో అడుగుపెట్టిన క్షణం నుంచి అతని కార్యకలాపాలను హోంల్యాండ్ సెక్యూరిటీకి చెందిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ పర్యవేక్షిస్తుంది.
అయితే ఇటీవల హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొన్ని విదేశీ విద్యార్థుల చట్టబద్ధమైన నివాస హక్కులను తన డేటాబేస్ నుంచి తొలగించిందట. దీంతో వీరికి చదువులు కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. అటువంటి పరిస్థితుల్లో, తమ హక్కులను కాపాడుకునేందుకు, విద్యను కొనసాగించేందుకు ప్రస్తుతం బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యలు విద్యార్థుల మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని, విద్యారంగంపై నెగటివ్ ముద్ర వేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read more :
Donald Trump: ట్రంప్-హార్వర్డ్ విద్యా సంస్థ మధ్య పెరుగుతున్న వివాదాలు!