భారీ నష్టాల కారణంగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయానని ఎయిర్ లైన్స్ మాజీ యజమాని విజయ్ మాల్యా (Vijay Mallya) పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాల్యా (Vijay Mallya) మాట్లాడుతూ.. కింగ్ ఫిషర్ ఉద్యోగులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉద్యోగులకు జరిగినదానికి తాను చింతిస్తున్నానని, వారికి క్షమాపణలు చెప్పడం తప్ప తాను చేయగలిగినది ఏమీ లేదని తెలిపారు. తన సంపద మొత్తం కోర్టు వివాదంలో చిక్కుకుందని గుర్తుచేస్తూ ఉద్యోగులకు జీతాలు అందించేందుకు తన శాయశక్తులా కృషి చేశానని మాల్యా (Vijay Mallya) వివరించారు. కోర్టు వివాదంలో చిక్కుకున్న సొమ్ములో నుంచి ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని బ్యాంకులకు, కర్ణాటక హైకోర్టుకు విజ్ఞప్తి చేశానని గుర్తుచేశారు.
కోర్టు తిరస్కరణపై అసహనం
తన అప్పుల కన్నా సీజ్ చేసిన ఆస్తుల విలువే ఎక్కువగా ఉందని, అయినప్పటికీ కోర్టు తన విజ్ఞప్తిని తోసిపుచ్చిందని ఆరోపించారు. దీంతో జీతాలు అందక ఇబ్బందులపాలైన ఉద్యోగులను ఆదుకోలేకపోయానని విజయ్ మాల్యా వివరించారు. ఈ విషయంలో తాను నిస్సహాయుడినని, తనను క్షమించాలని తన మాజీ సిబ్బందికి మాల్యా వరుసగా పదకొండవ ఏడాది కూడా క్షమాపణలు చెప్పారు. విజయ్ మాల్యా (Vijay Mallya) 2016లో భారతదేశం విడిచి లండన్‌కి వెళ్లిపోయినప్పటి నుంచి పలుచోట్ల న్యాయ ప్రక్రియను ఎదుర్కొంటున్నాడు. అతని మాటలు సానుభూతి కలిగించేలా ఉన్నా, న్యాయ పరంగా బాధ్యత తప్పించుకునే ప్రయత్నంగా కూడా భావిస్తున్నారు. విజయ్ మాల్యా ఇచ్చిన క్షమాపణలు వ్యక్తిగతంగా భావోద్వేగంగా ఉన్నా, అవి చర్యలు తీసుకోకపోతే అంతే పరిమితం అవుతాయి. ఆస్తులను మిగిలిన జీతాల కోసం ఉపయోగించాలన్న అభ్యర్థనపై భారత ప్రభుత్వం, న్యాయవ్యవస్థ చర్యలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: First Tea Shop In India: దేశంలోనే మొట్టమొదటి టీ స్టాల్: మూడు తరాల చరిత్ర