हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Latest Telugu News : UPI payments : ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్‌!

Sudha
Latest Telugu News : UPI payments : ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్‌!

దీపావళి పండుగ సీజన్ కావడంతో డిజిటల్ చెల్లింపులు (Digital payments) సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలు మునుపెన్నడూ లేనంతగా పెరిగి ఆల్-టైమ్ రికార్డు లను సృష్టిస్తున్నాయి. దీపావళి కొనుగోళ్ల జోరుతో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ సరికొత్త మైలురాళ్లను అధిగమించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ నెలలో యూపీఐ (Digital payments)ద్వారా జరుగుతున్న సగటు రోజువారీ లావాదేవీల విలువ ఏకంగా రూ. 94 వేల కోట్లకు చేరింది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. గత కొన్నేళ్లుగా జరుగుతున్న నెలవారీ యూపీఐ పేమెంట్లతో పోల్చి చూస్తే ఇది అత్యధిక వృద్ధి అని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే యూపీఐ తన జీవితకాలంలోనే అత్యుత్తమ నెలవారీ ప్రదర్శనను నమోదుచేసే దిశగా దూసుకెళ్తోంది. దీపావళి పండగతోపాటు ఇటీవల జీఎస్టీ రేట్లలో వచ్చిన మార్పులు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఈ నెల‌ 20న దీపావళి సందర్భంగా చెల్లింపులు భారీగా పెరిగాయి. పండగకు ముందు రోజు యూపీఐలో ఒక్కరోజే 74 కోట్ల లావాదేవీలు జరిగి ఆల్‌-టైమ్‌ రికార్డు సృష్టించాయి.

Read Also: Trump: ఎట్టకేలకు ట్రంప్ కు ప్రతిష్టాత్మక పీస్ అవార్డ్!

UPI payments
UPI payments

ఈ నెలలో ఇప్పటివరకు సగటున రోజుకు 69.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లోని 65.4 కోట్ల రికార్డును ఇప్పటికే అక్టోబర్‌ సగటు అధిగమించింది. సాధారణంగా నెల ఆరంభంలో జీతాలు, ఈఎంఐ చెల్లింపుల కారణంగా లావాదేవీలు ఎక్కువగా ఉండి, నెల మధ్యకు వచ్చేసరికి తగ్గుముఖం పడతాయి. కానీ ఈసారి పండగ ప్రభావంతో ఆ ధోరణి మారింది. ఈ నెల‌ 20 నాటికే రోజువారీ లావాదేవీల విలువ ఆరుసార్లు లక్ష కోట్ల రూపాయల మార్కును దాటింది. సెప్టెంబర్‌లో ఈ ఘనత కేవలం మూడుసార్లే నమోదైంది. ఈ దూకుడు చూస్తుంటే ఈ నెలలో మొత్తం లావాదేవీల విలువ తొలిసారిగా రూ. 28 లక్షల కోట్లు దాటుతుందని, గత రికార్డయిన రూ.25 లక్షల కోట్ల మార్కును అధిగమిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 85 శాతం వాటా యూపీఐదే కావడం విశేషం అంటున్నారు.

డిజిటల్ చెల్లింపులు అంటే ఏమిటి?

డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు అంటే నగదు కాకుండా, మొబైల్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు బదిలీ చేయడం.
ఇది ఆర్థిక లావాదేవీలను వేగంగా, సురక్షితంగా మరియు సులభంగా చేస్తుంది.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ప్రయోజనాలు ?

UPI దాని సౌలభ్యం మరియు భద్రత కారణంగా భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను విప్లవాత్మకంగా మార్చింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు UPI విజయం ఆధారంగా ఇలాంటి సిస్టమ్‌లను అన్వేషిస్తున్నాయి. UPI యొక్క విస్తృత స్వీకరణ భారతదేశం యొక్క డిజిటల్ చెల్లింపుల పెరుగుదలలో ఇది ఒక ముఖ్యమైన అంశంగా మారింది. దీని సౌలభ్యం మరియు భద్రత వల్ల భారతీయులు డబ్బు బదిలీ చేయడం మరియు ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం వంటివి విప్లవాత్మకంగా మారాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870