📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

హైదరాబాద్‌లో తమ ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు (ఐఏబి)ని ప్రారంభించిన యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ (యుఈఎల్)

Author Icon By sumalatha chinthakayala
Updated: November 20, 2024 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆవిష్కరణ మరియు పరిశ్రమ భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇండియా టూర్ 2024ను మరింతగా విస్తరించింది.

హైదరాబాద్: తమ కొనసాగుతున్న ఇండియా టూర్ 2024లో భాగంగా, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ (యుఈఎల్) ఈరోజు హైదరాబాద్‌లో తమ ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు (ఐఏబి)ని ప్రారంభించింది. ఈ ముఖ్యమైన మైలురాయి విశ్వవిద్యాలయం యొక్క మూడు-నగరాల పర్యటనలో రెండవ స్టాప్‌ని సూచిస్తుంది, ఇది విద్యా-పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మరియు సస్టైనబుల్ విద్యను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఏబి ప్రారంభంతో పాటు జరిగిన హెచ్ఆర్ రౌండ్‌టేబుల్, డిజిటల్ పరివర్తన, ఉద్యోగుల అనుభవం , వైవిధ్యత మరియు చేరికలతో సహా మానవ వనరులలో తాజా పోకడలు, సవాళ్లను చర్చించడానికి పరిశ్రమ నాయకులు, విద్యావేత్తలు మరియు ప్రభుత్వ అధికారులను ఒకచోట చేర్చింది.

ఐఏబిని ప్రారంభించడం ద్వారా, వినూత్నమైన మరియు పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి, విద్యార్థుల ఉపాధిని మెరుగుపరచడానికి , పరిశోధన మరియు ఆవిష్కరణలను నడపడానికి పరిశ్రమ నిపుణులతో భాగస్వామ్యం చేసుకోవటం యుఈఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహాత్మక చర్య యుఈఎల్ యొక్క ప్రోగ్రామ్‌లు జాబ్ మార్కెట్ యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. బోర్డ్ యొక్క ఎజెండా రెండు ముఖ్యమైన ప్రతిపాదనలను కలిగి ఉంది: (ఏ) భారతీయ విద్యార్థులలో అసాధారణమైన విద్యావిషయక విజయాన్ని గుర్తించి, ప్రోత్సహించడానికి మెరిట్-ఆధారిత స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం మరియు (బి) యుఈఎల్ యొక్క విలక్షణమైన కెరీర్‌ల ప్రతిపాదన యొక్క ప్రదర్శన, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాపరులైన గ్రాడ్యుయేట్‌లను పెంపొందించడానికి 4,500 కంటే ఎక్కువగా వున్న పరిశ్రమ భాగస్వామ్యంతో కూడిన నెట్‌వర్క్‌ పై ఆధారపడి ఉంటుంది.

హెచ్‌ఆర్ రౌండ్‌టేబుల్‌లో పలువురు ప్రతినిధులు చర్చించిన అంశాలు, ‘ఏళ్లుగా యుకె లో భారతీయ విద్యార్థుల భాగస్వామ్యం పెరుగుదల మరియు యుఈఎల్ లో భారతీయ విద్యార్థుల వాటా పెరగడం’; ‘యుఈఎల్ మరియు విస్తృత యుకె విద్యా మార్కెట్‌కు భారతీయ విద్యార్థుల ప్రాముఖ్యత’; ‘భారత విద్యార్థుల మార్కెట్ నుండి యుఈఎల్ అంచనాలు మరియు ఈ అంచనాలను అందుకోవడానికి చేపట్టిన కార్యక్రమాలు ‘; మరియు ‘భారత విద్యార్థులకు యుఈఎల్ అనువైన ఎంపిక కావడానికి ప్రధాన కారణాలు’ వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జరిగిన హెల్త్‌టెక్ రౌండ్‌టేబుల్, ‘ఆరోగ్య ఆవిష్కరణలు మరియు వెల్‌నెస్‌ను నడపడానికి భారతదేశంలో యుఈఎల్ యొక్క ఇయర్ ఆఫ్ హెల్త్ కార్యక్రమం ను ప్రారంభించడం’ అనే అంశంపై జరిగింది. సీమెన్స్ మరియు టి -హబ్ తో యుఈఎల్ యొక్క బలమైన భాగస్వామ్యం ఈ కార్యక్రమం నిర్వహణలో కీలకపాత్ర పోషించింది. ఈ ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం చేసుకోవటం ద్వారా, యుఈఎల్ తమ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, వర్క్ ప్లేస్‌మెంట్‌లు మరియు పరిశోధన ప్రాజెక్ట్‌ల కోసం ప్రత్యేకమైన అవకాశాలను అందించగలదు.

“సాంకేతిక నైపుణ్యం మరియు వ్యవస్థాపక స్ఫూర్తికి పేరుగాంచిన హైదరాబాద్, మా ఇండియా టూర్ 2024కి సరైన నేపథ్యం అందిస్తుంది ” అని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ వైస్-ఛాన్సలర్ మరియు ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అమండా జె . బ్రోడెరిక్ అన్నారు. “మా ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డ్ ప్రారంభం మరియు పూర్తి పరిజ్ఞానంతో కూడిన విధంగా జరిగిన హెచ్‌ఆర్ రౌండ్‌టేబుల్ బలమైన పరిశ్రమ-అకాడెమియా భాగస్వామ్యాలను పెంపొందించాలానే మా ప్రయత్నాలలో కీలకమైన భాగాలు. పరిశ్రమ నాయకులతో భాగస్వామ్యం చేసుకోవటం ద్వారా, గ్లోబల్ జాబ్ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు విజ్ఞానంతో మా విద్యార్థులను సన్నద్ధం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ కార్యక్రమం , స్థిరమైన విద్య మరియు ఆవిష్కరణలపై మా దృష్టితో కలిపి, భారతదేశ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపడానికి యుఈఎల్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది..” అని అన్నారు.

యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ (యుఈఎల్) ఇండియా టూర్ 2024, సిమెన్స్ మరియు టి -హబ్‌ల సహకార కార్యక్రమం, ఉన్నత విద్యలో సుస్థిరతను పెంపొందించడం మరియు భారతదేశంలోని విద్యాసంస్థలు మరియు పరిశ్రమల మధ్య ప్రభావవంతమైన భాగస్వామ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ బహుళ-నగర పర్యటన విద్య మరియు పరిశ్రమల సహకారాన్ని బలోపేతం చేయడానికి, సస్టైనబుల్ విద్యను ప్రోత్సహించడానికి మరియు తదుపరి తరం ప్రపంచ నాయకులను ప్రేరేపించడానికి రూపొందించబడింది. అంతర్జాతీయ భాగస్వామ్యానికి యుఈఎల్ యొక్క నిబద్ధత మరియు గ్లోబల్ పవర్‌హౌస్‌గా భారతదేశం యొక్క పాత్రను గుర్తించడం ఈ కార్యక్రమంను ముందుకు నడిపించాయి. ప్రముఖ భారతీయ సంస్థలు మరియు ఇండస్ట్రీ ప్లేయర్‌లతో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా, విద్యాసంస్థలు మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించాలని యుఈఎల్ లక్ష్యంగా పెట్టుకుంది, విద్యార్థులు ఆచరణాత్మక అనుభవాన్ని పొందేందుకు మరియు భవిష్యత్ కెరీర్‌లకు సిద్ధమయ్యేలా చేస్తుంది. సుస్థిర అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు మరియు ప్రపంచ పౌరసత్వంతో సహా వివిధ నేపథ్యంలను ఈ పర్యటన అన్వేషిస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ యొక్క ఇండియా టూర్ 2024 నవంబర్ 19న హైదరాబాద్‌లో హెచ్ఆర్ ఇన్నోవేషన్‌పై వ్యూహాత్మక రౌండ్‌టేబుల్‌తో కొనసాగింది. ఆ తర్వాత నవంబర్ 22న వదోదరలో ప్రతిష్టాత్మకమైన విమెన్ ఇన్ లీడర్‌షిప్ అవార్డుల వేడుక జరుగునుంది.

hyderabad ndustry Advisory Board (IAB) University of East London (UEL)

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.