📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

‘ది టీచర్ యాప్’ను ఆవిష్కరిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Author Icon By sumalatha chinthakayala
Updated: November 27, 2024 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వివిధ రకాల ఉపాధ్యాయ అభ్యసన స్టైల్స్ కు మద్దతు ఇవ్వడానికి ది టీచర్ యాప్ ఉచిత, మంచి-క్వాలిటీ కలిగిన, ఇంటరాక్టివ్ డిజిటల్ వనరులను అందిస్తుంది. సృజనాత్మక మరియు చాలా చోట్ల పరీక్షించిన పద్ధతులతో అధ్యాపకులను శక్తివంతం చేస్తుంది, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా భవిష్యత్తులో డైనమిక్ తరగతి గదులకు వారి కోసం సిద్ధం చేస్తుంది. భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ నిబద్ధతను ప్రదర్శిస్తూ, ఈ ది టీచర్ యాప్ సాంకేతిక ఆవిష్కరణలను 12 రాష్ట్రాల్లో కలిసిపోయి విద్యను కొత్త విధంగామారుస్తుంది.

న్యూఢిల్లీ : భారతీ ఎంటర్ ప్రైజెస్ ప్రజా సంక్షేమం కోసం పని చేసే విభాగమైన భారతీ ఎయిర్ టెల్ ఫౌండేషన్ ది టీచర్ యాప్ ను లాంచ్ చేసింది. 21 వ సెంచరీ క్లాస్ రూమ్ డిమాండ్లను తీర్చడానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న నైపుణ్యాలతో అధ్యాపకులను సన్నద్ధం చేయడం ద్వారా భారతదేశంలో విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రూపొందించిన వినూత్న డిజిటల్ వేదిక ఇది. ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ వేదికను ఆవిష్కరించారు. ఇంకా విద్యారంగ ప్రముఖులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బీఈడి విద్యార్థులతో కలిసి భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేశ్ భారతీ మిట్టల్ మరియు భారతీ ఎయిర్ టెల్ ఫౌండేషన్ సిఇఒ శ్రీమతి మమతా సైకియా కూడా హాజరయ్యారు.

క్షేత్రస్థాయి అనుభవం, అధ్యాపకులు ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతైన అవగాహన ఆధారంగా.., భారతీ ఎయిర్ టెల్ ఫౌండేషన్ రూపొందించిన ది టీచర్ యాప్, సృజనాత్మక డిజిటల్ వనరుల ద్వారా సమయం-పరీక్షించబడిన మరియు భవిష్యత్తుకు-ఉపయోగపడే నైపుణ్యాలు రెండింటితో వారిని సన్నద్ధం చేయడానికి రూపొందించిన వేదిక ఇది. ఉపాధ్యాయుల నుండి డైరెక్ట్ ఇన్ పుట్ లతో అభివృద్ధి చేయబడిన ఈ యూజర్ కి అనుగుణంగా ఉన్న, ఉచిత యాప్ వెబ్, iOS మరియు Android అన్నింటిలో యాక్సెస్ చేయబడుతుంది, ఇది దేశవ్యాప్తంగా ఉన్న అధ్యాపకులకు అంతరాయం లేని యాక్సెస్ ని అందిస్తుంది. ఈ ప్లాట్ ఫామ్ 260+ గంటల మంచి క్వాలిటీ గల వనరులను అందిస్తుంది. కోర్సులు, లెర్నింగ్ బైట్లు, చిన్న వీడియోలు, పాడ్ కాస్ట్ లతో సహా సృష్టించబడినవి మరియు క్యూరేటెడ్ చేయబడినవి, మరియు థీమాటిక్ ఫెస్ట్ లు, వెబినార్ లు, పోటీలు మరియు క్విజ్ లు వంటి ఇంటరాక్టివ్ వెబినార్ ల ఫార్మాట్ లు, ఇవన్నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, బోధనా పద్ధతులను పెంచడానికి మరియు తరగతి గదుల్లో విద్యార్థుల నిమగ్నతను పెంచడానికి రూపొందించబడ్డాయి. అదనంగా, ఈ యాప్ ఆచరణాత్మక తరగతి గది వ్యూహాలను అందించే ప్రత్యక్ష నిపుణుల సెషన్లను కూడా కలిగి ఉంది మరియు కొన్ని మంచి ప్రభావవంతమైన కథలను హైలైట్ చేయడం ద్వారా ఉపాధ్యాయుల కమ్యూనిటీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాట్ ఫామ్ లో టీచింగ్ కిట్స్ అని పిలువబడే ఒక ప్రత్యేక విభాగం ఉంది. దీనిలో 900+ గంటల కంటెంట్ ఉంటుంది. క్లాస్ రూమ్ డెలివరీ కోసం టీచింగ్ వీడియోలు, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ యాక్టివిటీస్, వర్క్ షీట్స్, లెసన్ ప్లాన్స్, క్వశ్చన్ బ్యాంక్ వంటి టూల్స్ తో టీచర్లకు సపోర్ట్ చేసేలా ఈ ఫీచర్ ను రూపొందించారు. పాఠశాలలను సురక్షితమైన మరియు సంతోషకరమైన నేర్చుకునే ప్రదేశాలుగా మార్చాలనే లక్ష్యంతో, థ టీచర్స్ యాప్ ఉపాధ్యాయుల ఎదుగుదలకు తోడ్పడటమే కాకుండా, స్కూల్ లీడర్లు మరియు నిర్వాహకులకు సాధికారత కల్పిస్తుంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న విద్యా అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉన్న విద్యావేత్తలను తయారు చేయడమే ఈ యాప్ లక్ష్యం.

delhi The Teacher App Union Education Minister Dharmendra Pradhan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.