📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

UK: బ్రిటన్ లోఇద్దరు సిక్కుల పై దాడి

Author Icon By Pooja
Updated: August 19, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూకేలో ఇద్దరు సిక్కులపై జరిగిన విద్వేషపూరిత దాడి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వోల్వర్‌హాంప్టన్ నగరంలోని ఒక రైల్వే స్టేషన్ వెలుపల గత శుక్రవారం (ఆగస్టు 15) ఈ దారుణ ఘటన జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ముగ్గురు యువకులు ఇద్దరు సిక్కులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. బాధితులు కింద పడిపోయినా, వారి తలపాగాలు ఊడిపోయినా పట్టించుకోకుండా ఒక యువకుడు వారిని పదేపదే కాలితో తన్నడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఈ దాడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అరెస్ట్(Arrest) చేశారు. అయితే, విచారణ అనంతరం వారిని బెయిల్‌పై విడుదల చేసినట్లు సమాచారం.

దాడిని ఖండించిన సుఖ్‌బీర్ సింగ్ బాదల్

ఈ దాడిని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ తీవ్రంగా ఖండించారు. “ఇది సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్న జాత్యహంకార విద్వేష దాడి. ఎల్లప్పుడూ అందరి బాగోగులు కోరుకునే సిక్కులపై ఇలాంటి దాడులు జరగడం చాలా దారుణం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూకేలో నివసిస్తున్న సిక్కుల భద్రత గురించి అక్కడి ప్రభుత్వంతో చర్చించాలని ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు.

కేసు నమోదు దర్యాప్తు

ఈ ఘటనపై బ్రిటిష్ రవాణా(British Transport) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. “రైల్వే నెట్‌వర్క్‌లో ఇలాంటి ప్రవర్తనను ఎంతమాత్రం సహించబోము. పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోంది” అని వారు ఒక ప్రకటనలో తెలిపారు. వోల్వర్‌హాంప్టన్ ఎంపీ సురీనా బ్రాకెన్‌రిడ్జ్ కూడా ఈ దాడిని ఖండించారు. వోల్వర్‌హాంప్టన్ నగరం విభిన్న సంస్కృతులకు నిలయమని, ప్రజలందరూ సంయమనంతో, ఐక్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్ట్ చేయడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ajit-doval-on-peaceful-india-china-relations/national/532733/

Attack Breaking News in Telugu Britain Google News in Telugu sikh Sukhbir Singh Badal Telugu News Today UK

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.