📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: US-China: చైనా వంట నూనెపై ట్రంప్ ఆంక్షలు

Author Icon By Vanipushpa
Updated: October 15, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అరుదైన ఖనిజాల విషయంలో చైనా(China) పెట్టిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆ దేశంపై వందశాతం సుంకాలను విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతకు ముందు అందరితో పాటూ 32 శాతం టారీఫ్ లు అమలు చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు వంద తోడై..మొత్తంగా చైనాపై 132శాతం టారిఫ్ లు అమల్లోకి వచ్చాయి. దీనిపై చైనా మండిపడుతోంది. అమెరికా అవలంభిస్తున్న విధానాలు న్యాయంగా లేవని చైనా వాణిజ్య శాఖ ప్రకటన జారీ చేసింది. మేము తగువులు పెట్టుకోవాలని అనుకోము. కానీ మా మీదకు యుద్ధానికి వస్తే ఎక్కడా తగ్గము అని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే అమెరికాపై ఆంక్షల వర్షం కురిపిస్తోంది.

Read Also: MTV: ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేతను ప్రకటించిన యాజమాన్యం

US-China: చైనా వంట నూనెపై ట్రంప్ ఆంక్షలు

సముద్రంలోకి వస్తే ప్రత్యేక ఫీజులు వసూలు

తాజాగా ఇరు దేశాల వాణిజ్య యుద్ధం సముద్రానికి పాకింది. వాణిజ్య నౌకలపై అమెరికా, చైనా దేశాలు ప్రత్యేక ఫీజులు ప్రకటించాయి. అమెరికా యాజమాన్యం లేదా ఆ దేశ జెండా ఉన్న షిప్ అయినా సరే తమ ఆధీనంలో ఉన్న సముద్రంలోకి వస్తే ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తామంటూ చైనా ప్రకటించింది. దీనిలో కేవలం చైనా నిర్మించిన నౌకలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఇవే ఫీజులను మొదలుపెట్టింది. ఈరోజు నుంచి అవి అమల్లోకి వస్తాయని చెప్పింది.

వంట నూనెపై ఆంక్షలు..

వీటికి తోడు ఈ రోజు అమెరికా మరో కొత్త ఆంక్షలను ప్రకటించింది. అమెరికా సోయాబీన్లను కొనడానికి చైనా నిరాకరిస్తున్న కారణంగా తాము ఆ దేశ కుకింగ్ ఆయిల్ ను కొనము అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వంట నూనెతో సంబంధం ఉన్న చైనా వ్యాపారాన్నింటినీ ముగించాలని అనుకుంటున్నామని చెప్పారు. అమెరికా సోయీబీన్లను చైనా ఉద్దేశపూర్వకంగా కొనుగోలు చేయడంల ఏదని ట్రంప్ ఆరోపించారు.

సోయాబీన్ ను కొనుగోలు చేసే దేశాల్లో చైనా మొదటిది

దీని వలన అమెరికాలోని సోయాబీన్ రైతులకు ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. అందుకనే ఈ చర్యలను తీసుకున్నామని ట్రంప్ వివరించారు. వంట నూనెను అమెరికానే సొంతంగా ఉత్పత్తి చేసుకోగలదు. దానిని చైనా నుంచి తెచ్చుకోవలసిన అవసరం లేదని చెప్పారు. యూఎస్ నుంచి సోయాబీన్ ను కొనుగోలు చేసే దేశాల్లో చైనా మొట్టమొదటిది. ఇదే అతి పెద్ద కొనుగోలుదారు కూడా. 2024లో దాదాపు $12.8 బిలియన్ల విలువైన 27 మిలియన్ మెట్రిక్ టన్నులను దిగుమతి చేసుకుంది. అయితే ఈ ఏడాది మే నుంచి చైనా మొత్తంగా సోయాబీన్ లను కొనుగోలు చేయడం మానేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Chinese cooking oil ban Chinese imports cooking oil trade restrictions Telugu News Trump administration policies Trump sanctions China US China Trade War

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.