📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

ట్రైడెంట్ గ్రూప్ కర్మయోగి రిక్రూట్ మెంట్ డ్రైవ్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: January 15, 2025 • 6:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌తో.. సమాజంలో ఉన్న కమ్యూనిటీలపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం, అదే విధంగా వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడం పట్ల తన అంకితభావాన్ని ట్రైడెంట్ గ్రూప్ చాటిచెప్తుంది.

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన సంస్థగా గుర్తింపు పొందిన ట్రైడెంట్ గ్రూప్.. ఇప్పుడు భారతదేశం అంతటా 3000 మంది నైపుణ్యం కలిగిన వ్యక్తులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా భారతదేశం మొత్తం కర్మయోగి రిక్రూట్ మెంట్ డ్రైవ్ ని మొదలుపెట్టింది. సమాజ అభివృద్ధికి ట్రైడెంట్ గ్రూప్ ఎప్పుడూ ముందుటుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పుడు ఈ కర్మయోగి రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా… సాధికారత కలిగిన సమాజాన్ని నిర్మించడానికి మరియు దేశం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడటానికి తనకున్న నిబద్ధతను మరోసారి చాటిచెప్పినట్లు అయ్యింది.

ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్… మధ్యప్రదేశ్ (బుధ్ని) మరియు పంజాబ్ (ధౌలా మరియు సంఘేరా) లపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అన్నింటికి మించి మహిళా అభ్యర్థులు మరియు క్రీడా నేపథ్యాల నుండి వచ్చిన అభ్యర్థులపై దృష్టి పెడుతుంది. 3,000+ వ్యక్తులకు ఉపాధి కల్పించడం ద్వారా, ట్రైడెంట్ గ్రూప్ పరోక్షంగా 15,000 మంది కుటుంబ సభ్యులకు ప్రయోజనం చేకూరుస్తుంది. తద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుర్చి జాతీయ GDP మరింతగా పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది, మహిళా సభ్యులకు సాధికారత కల్పిస్తుంది మరియు విలువైన పన్ను ఆదాయాన్ని సృష్టిస్తుంది.

image

ఈ సందర్భగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి సీహెచ్ ఆర్ వో ట్రైడెంట్ గ్రూప్ పూజా లూత్రా మాట్లాడుతూ.. “కర్మయోగి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వేలాది మందికి పని అవకాశాలను సృష్టించాలనే మా దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. అదే సమయంలో మేము సేవలందిస్తున్న కమ్యూనిటీలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ కార్యక్రమం మా శ్రామిక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా, వ్యక్తులను శక్తివంతం చేయడం మరియు వారు అభివృద్ధి చెందడానికి అవకాశాలను అందించడం ద్వారా దేశ నిర్మాణానికి – వికసిత్ భారత్ వైపు దోహదపడుతుంది.” అని అన్నారు.

రిక్రూట్ మెంట్ ప్రక్రియలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సమర్పణ, ఆఫ్‌లైన్ అంచనా మరియు నైపుణ్య మూల్యాంకనాలు ఉంటాయి. విజయవంతమైన అభ్యర్థులు ట్రైడెంట్ గ్రూప్ యొక్క ఆపరేషన్స్, ఇంజనీరింగ్, నిర్వహణ మరియు పరిపాలనతో సహా వివిధ విభాగాలలో జాయిన్ అవుతారు. 8 గంటల పనిదినం కోసం నెలకు రూ. 50,000 ప్రారంభ జీతం అందిస్తా. ఇది గౌరవప్రదమైన వేతనాలు మరియు మెరుగైన పని-జీవిత సమతుల్యతను నిర్ధారిస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో, ట్రైడెంట్ గ్రూప్ తాను సేవలందిస్తున్న కమ్యూనిటీలపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి తన అంకితభావాన్ని మరోసారి చాటిచెప్పినట్లు అయ్యింది.

Community Developed India Karmayogi Recruitment Drive Trident Group

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.