📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

News telugu: Tirumala-హైకోర్టు ఆదేశాలపై త్రిసభ్య ధర్మాసనం స్టే..సిట్ దర్యాప్తు ఏమైందని ప్రశ్న

Author Icon By Sharanya
Updated: September 27, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: తిరుమలేశుని లడ్డూలకు కల్తీ నెయ్యిసరఫరా (Adulterated ghee supply)కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టిటిడి మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ పిఎ చిన్నప్పకు శుక్రవారం సుప్రీంకోర్టు త్రిసభ్యధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ఊరట లభించలేదు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సిబిఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఏపి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై త్రిసభ్యధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ఏమైందనే కోణంలో ప్రశ్నించింది. సుప్రీంకోర్టు సిజెఐ జస్టీస్ బీఆర్ గవాయ్ తిరు మల లడ్డూ దర్యాప్తు కేసులో సిట్ వేరొక అధికారికి అధికారాలు బదలాయించడం సరికాదని జస్టీస్ గవాయ్ పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీ సులు జారీచేసింది. టిటిడి(TTd)కి కల్తీనెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితులుగా ఉన్న షోమిలైజైన్, విపిన్ జైన్, అపూర్వ వినయ్కంత్ చావ్దాలకు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. అయితే తాజాగా సుప్రీం త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీచేయడం సంచలనంగా మారింది. మరీ రానున్నరోజుల్లో దేవదేవునికి మోసం చేసిన వారి పరిస్థితి ఏమిటనేది తేలిపోనుంది.

News telugu

ఇప్పటికే ఆధారాలు సమర్పించిన సిట్ :

భక్తులు పవిత్రంగా భావించే లడ్డూప్రసాదాల తయారీకి జంతువుల కొవ్వునూనె, ఇతర శాఖాహారపదార్థాలతో నూనె కల్తీచేసిన నెయ్యివినియోగించారనే ఆరోపణలపై 15నెలల్లో సిబిఐ సిట్ బృందం అధికారులు లోతుగా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్లలో టెండర్లలో దక్కించుకున్న ఒప్పందం ప్రకారం సరఫరా చేయాల్సిన నాణ్యతప్రమాణాలతో నెయ్యికి బదులు నాసి రకంగా, జంతువుల కొవ్వునూనె కలిపారనేది ప్రధాన అరోపణలు.ఇప్పటికే లడ్డూల తయా రీలో జంతువుల కొవ్వునూనె కల్తీచేసి వాడారనే దుమారం రేపిన నేపథ్యంలో కల్తీనెయ్యిసరషరా చేసిన తమిళనాడులోని ఏఆర్ డైరీపై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10 లక్షల కిలోల నెయ్యిసరషరాకు ఏఆర్ డైరీకి 2024మే 15న ఆర్డన్ఇచ్చామని, జూన్ 12,20, 25 తేదీలతో బాటు జులై 6వతేదీ 4ట్యాంకర్ల కల్తీ నెయ్యి సర ఫరా చేసిందనేది టిటిడి ఫిర్యాదులో పేర్కొంది

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News GheeAdulteration HighCourtStay LadduScandal latest news SITInvestigation tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.