దేశంలో బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు గణనీయంగా పెరిగాయి. ఆర్బీఐ (RBI) తాజా డేటా ప్రకారం, జూన్ 30, 2025 నాటికి మొత్తం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.67,003 కోట్లకు చేరాయి. వీటిలో రూ.58,330.26 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉండగా, రూ.8,673.72 కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నాయి.ప్రభుత్వ రంగ బ్యాంకు ల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఎస్బిఐలో రూ.19,329.92 కోట్ల డిపాజిట్లు క్లెయిమ్ (Deposits worth Rs 19,329.92 crore claimed in SBI) చేయకుండా ఉన్నాయి. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.6,910.67 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.6,278.14 కోట్లు కలిగి ఉన్నాయి.ప్రైవేట్ రంగంలో ఐసిఐసిఐ బ్యాంక్ రూ.2,063.45 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రూ.1,609.56 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,360.16 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను కలిగి ఉన్నాయి.
నామినీగా ఉంటే డిపాజిట్లు ఎలా క్లెయిమ్ చేయాలి?
మీ కుటుంబ సభ్యుడు లేదా బంధువు మీను నామినీగా పేర్కొంటే, మీరు ఈ డిపాజిట్లను క్లెయిమ్ చేయవచ్చు. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత, బ్యాంకు మీ ఖాతాకు డబ్బు బదిలీ చేస్తుంది.ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, వర్చువల్ డిజిటల్ ఆస్తులను సాధారణ ఆర్థిక మార్కెట్లో చేర్చే ప్రణాళికలు లేవని తెలిపారు.
వర్చువల్ కరెన్సీపై ఆర్బీఐ హెచ్చరికలు
ఆర్బీఐ 2021 మే 31న జారీ చేసిన సర్క్యులర్‌లో ముఖ్యమైన సూచనలు చేసింది. కస్టమర్ డ్యూ డిలిజెన్స్ (KYC) పూర్తి చేయాలని, మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల సమీకరణను అడ్డుకోవాలని తెలిపింది. అలాగే, PMLA 2002 కింద అన్ని నియమాలను పాటించాలని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది.వర్చువల్ కరెన్సీకి సంబంధించిన ఆర్థిక, చట్టపరమైన ప్రమాదాలపై ఆర్బీఐ ఇప్పటికే హెచ్చరించింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించాలని సూచించింది.
Read Also : APSRTC : మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 74 శాతం బస్సులు: ఆర్‌టీసీ ఎండీ