Tirumala: తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. శ్రీవారి సేవకులకు మరింత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వారికి శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు ప్రత్యేక తరగతులు నిర్వహించనుంది. టీటీడీ(Tirumala Tirupati Devasthanam) ఈఓ జె. శ్యామలరావు ఆదేశాల మేరకు, ఈ నెల 24వ తేదీ నుంచి మొదటి విడత శిక్షణ ప్రారంభం కానుంది. ఈ మేరకు టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ, జెఈఓ వీరబ్రహ్మం, ప్లానింగ్ విభాగం నిపుణులు, ఐఐఎం అహ్మదాబాద్ ఆచార్యులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు.
8 అంశాలలో నైపుణ్యం పెంపుపై దృష్టి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో శ్రీవారి సేవకుల ప్రమాణాలను పెంచాలనే సంకల్పంతో కొన్ని సంస్కరణలు చేపట్టామని ఈఓ శ్యామలరావు తెలిపారు. ఇందులో భాగంగా, గ్రూప్ సూపర్వైజర్లు, సేవకుల ట్రైనర్ల(Servant trainers)రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. ఈ శిక్షణ పొందిన ట్రైనర్లు, సూపర్వైజర్లు భవిష్యత్తులో సేవకులకు శిక్షణ ఇస్తారని ఆయన పేర్కొన్నారు.
మొదటి విడత శిక్షణ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఉదయం వేళల్లో విధానపరమైన అంశాలపై, మధ్యాహ్నం వేళల్లో వివిధ సేవా కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించేలా ఈ శిక్షణను రూపొందించారు. నైపుణ్యాలు, స్పూర్తిదాయకమైన నాయకత్వం, సులభ పద్ధతిలో అందరికీ అర్థమయ్యేలా ఆదర్శ సేవా లక్షణాలు, పలు భాషలలో ప్రాథమిక నైపుణ్యం వంటి 8 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈఓ సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈఓ చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి, సీపీఆర్ఓ డాక్టర్ తలారి రవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి సేవకులకు శిక్షణ ఎందుకు ఇస్తున్నారు?
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మరింత మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు సేవకుల నైపుణ్యాన్ని పెంచడం కోసం ఈ శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది?
మొదటి విడత శిక్షణ ఈ నెల 24వ తేదీ నుండి మూడు రోజుల పాటు కొనసాగనుంది.
Read hindi news : hindi.vaartha.com
Read also: