అగ్రరాజ్యమైన అమెరికాలో విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. టెలికాం సేవల్లో టెక్నికల్ సమస్యలు రావడంతో డల్లాస్ సహా పలు ఎయిర్పోర్టులలో 1800పైగా విమానాలపై ప్రభావం పడినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎ) అధికారులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ సాంకేతిక సమస్య వల్ల డల్లాస్ ఎయిర్ పోర్టులో 20శాతం విమానాలు రద్దు అయినట్లు తెలిపారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన 200కు పైగా విమానాలు రద్దవగా, 500కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచినట్లు వెల్లడించారు.
ఆలస్యంగా నడవనున్న 1,100 విమానాలు
విమాన ట్రాకింగ్ చేసే ఫ్లైట్ వేర్(Flight wear) అనే సంస్థ ప్రకారం, సౌత్ వెస్ ఎయిర్లైన్స్ చెందిన 1,100కు పైగా విమానాలు చాలా ఆలస్యంగా నడవనున్నాయి. అయితే ఇలాంటి సాంకేతిక సమస్యలు ఈ ఏడాది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్కు కొత్తకాదు. ఈమధ్య కాలంలో ఎప్పటికప్పుడు ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. గతవారం కూడా డెన్వర్ అంతర్జాతీయ యిర్పోర్టులో కూడా ఇలాంటి ఓ సమస్య తలెత్తింది.
తరచూ సాంకేతిక సమస్యలతో ప్రయాణీకుల ఇబ్బందులు
ఇటీవల ఎయిర్పోర్టులు తరచూ సాంకేతిక సమస్యలకు గురవుతున్నాయి. దీంతో చేరుకోవాల్సిన గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణీకులు(Passengers) తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు విమానాలు రద్దు కావడం, గంటలకు గంటలు వేచి చూడడం వల్ల పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఎయిర్‌లైన్‌లు ఏ చర్యలు తీసుకున్నాయి?
ప్రయాణికులకు అప్‌డేట్లు, రీ-షెడ్యూలింగ్ మరియు రిఫండ్ సౌకర్యాలు అందిస్తున్నాయి.
విమాన ప్రయాణికులకు సూచనలు ఏవైనా ఉన్నాయి?
టికెట్ కలిగిన ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్ లేదా ఎయిర్‌లైన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్థితిని తనిఖీ చేయమని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: