📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Teacher promotions: ప్రమోషన్లకు అడ్డంకిగా ఉన్న అడ్వకసీ ఉత్తర్వులను ఉపసంహరించాలి

Author Icon By Sharanya
Updated: July 22, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో పనిచేస్తున్న ఎస్సి, ఎస్టి ఉపాధ్యాయుల ప్రమోషన్లకి అడ్డంకిగా ఉన్న అడ్వకసీ ఉత్తర్వులను వెంటనే ఉపసంహారించుకోవాలని ఎస్సి, ఎసిసి ఉపాధ్యాయ సంఘం టిఎస్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే పనిచేస్తున్న రెండు ఎస్సి, ఎస్టి ఉపాధ్యాయ సంఘాలు (SC and ST teachers’ unions) ఐక్యమై ఒకే బలమైన సంఘంగా ఏర్పడాలని భావించి సోమవారం హైదరాబాద్ లో సమావేశమైన సంఘాలు ఎస్సి, ఎసిసి ఉపాధ్యాయ సంఘం తెలంగాణ స్టేట్గా ఏర్పడినట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు తొంట సత్యనారాయణ తెలిపారు.

ఎస్సి, ఎస్టి ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా పనిచేసి

ఎస్సి, ఎస్టి ఉపాధ్యాయులు ఐక్యంగా కలిసి పనిచేసి, సంఘాన్ని బలోపేతం చేస్తూ ఎసిసి, ఎసిటి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకోవాలని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు తొంట సత్యనారాయణ నూతన రాష్ట్ర ప్రధానకార్యదర్శి పెంట అంజయ్య తెలిపారు. రెండు ఎసిసి, ఎస్టి ఉపాధ్యాయ సంఘాలు ఐక్యమై, ఏకీకరణ చెంది, ఒకే బలమైన సంఘంగా ఏర్పడి.. మహానీయులు మహత్మ జ్యోతిబాపూలే (Mahatma Jyotibapule), భారతరత్న బాబా సాహెచ్ బిఆర్ అంబేద్కర్, సావిత్రి బాయి పూలేల ఆశయ సాధన కొరకు పనిచేయాలని తీర్మానించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వెంటనే ప్రమోషన్లు, ట్రాన్సఫర్లు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని డిమాంద్ చేశారు. ఎస్సి, ఎసిటి ఉపాధ్యాయుల ప్రమోషన్లకు అడ్డంగా ఉన్న అడ్వకసీ ప్రభువ్వ ఉత్తర్వును నంబర్ 2ను, మెమో నంబర్ 26559ను రద్దు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదలీలు చేపట్టాలి ఎస్ సి, ఎస్టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్మానం అమలు పర్చాలని డిమాండ్ చేశారు. ఎస్సి, ఎస్టి ఉపాధ్యాయ సంఘాల ఏకీకరణ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్లోని సామ్రాట్ అశోక భవనంలో నిర్వహించి ఏకగ్రీవంగా నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర అక్యక్షులుగా తొంట సత్యనారాయణ (యాదాద్రి భువనగిరి జిల్లా) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా సూర్యదేవర దానయ్య (రంగారెడ్డిజిల్లా), చాగంటి ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెంట అంజయ్య (సిరిసిల్ల జిల్లా), రాష్ట్ర కోశాధికారిగా నంది సుశీల్ కుమార్ (నిజామాబాద్ జిల్లా) రాష్ట్ర ప్రధాన సలహాదారుగా బండారు రవి వర్ధన్, రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా పారునంది రామయ్య, మోతె సాయన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నూతన రాష్ట్ర అధ్యక్షులు తొంట సత్యనారాయణ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Krishna River: కృష్ణా, గోదావరి పొంగుతున్నా..అలుగుపారని చెరువులు

#telugu News Advocacy Orders Breaking News education department latest news Promotion Delays teacher promotions Teachers' Rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.