AI: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘స్విగ్గీ’ సరికొత్త టెక్నాలజీతో మార్కెట్లోకి దూసుకొచ్చింది. ‘మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్’ (MCP) అనే అత్యాధునిక ఓపెన్ సోర్స్ సాంకేతికతను తన ఇన్‌స్టామార్ట్, ఫుడ్ డెలివరీ మరియు డైన్-అవుట్ సేవలకు అనుసంధానించింది. ఈ వినూత్న అప్‌డేట్ వల్ల వినియోగదారులు ఇకపై స్విగ్గీ యాప్‌ను ప్రత్యేకంగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా చాట్ జీపీటీ (Chat GPT), క్లాడ్ (Claude), మరియు గూగుల్ జెమిని (Gemini) వంటి ఏఐ చాట్‌బాట్‌ల ద్వారా ఆర్డర్లు చేసుకోవచ్చు.
Read also: Payment App: ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
ఏఐ అసిస్టెంట్‌తో ఆర్డర్ చేయడం ఎలా?
ఈ కొత్త విధానం ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన వంటకాల పేర్లను ఏఐకి చెబితే, అది నేరుగా స్విగ్గీ సర్వర్ల నుంచి సమాచారాన్ని సేకరించి ఆర్డర్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. కేవలం ఆహారం, కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయడమే కాకుండా.. డైట్ ప్లాన్లకు అనుగుణంగా వస్తువులను ఎంచుకోవడం, రెస్టారెంట్లలో టేబుల్స్ బుక్ చేయడం వంటి పనులను కూడా ఏఐ అసిస్టెంట్లే చక్కబెడతాయి. క్విక్ కామర్స్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ తరహా సాంకేతికతను ప్రవేశపెట్టిన మొదటి సంస్థగా స్విగ్గీ నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: