📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Stock markets: కాల్పుల విరమణతో భారీగా లాభాలు అందుకున్న స్టాక్ మార్కెట్లు

Author Icon By Sharanya
Updated: May 12, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే విపరీతంగా లాభాల బాట పట్టాయి. నాలుగు రోజులపాటు సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర కాల్పులు, ఉగ్రదాడుల తర్వాత కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం, పెట్టుబడిదారులలో కొత్త నమ్మకాన్ని కలిగించింది.

Stock markets

ఈ పరిణామం దలాల్ స్ట్రీట్‌ (Dalal Street) లో సానుకూల సెంటిమెంట్‌ను కొనుగోళ్ల పండుగ వాతావరణం నెలకొంది. సోమవారం ఉదయం 10:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) ఏకంగా 2254.45 పాయింట్లు పెరిగి 81,708.92 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 694.65 పాయింట్ల లాభంతో 24,702.65 వద్ద ట్రేడ్ అయింది. ఈ భారీ ర్యాలీతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో కొనసాగిన తీవ్ర కాల్పుల అనంతరం కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం పాకిస్థాన్ ప్రధాన స్టాక్ సూచీపై కూడా సానుకూల ప్రభావం చూపింది. అక్కడి మార్కెట్ సోమవారం ప్రారంభంలోనే 9 శాతానికి పైగా లాభపడింది.

కీలక రంగాల్లో భారీ లాభాలు

బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ, పోర్ట్స్ రంగాల్లోని దిగ్గజ సంస్థల షేర్లు భారీగా లాభపడినవి. అదానీ గ్రూప్ సంస్థల షేర్లు 5% వరకు పెరగగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కీలక కంపెనీలు 3–4% మధ్య లాభాలతో ట్రేడ్ అయ్యాయి. వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బాతిని ఈ ప్రస్తుత ర్యాలీకి పలు సానుకూల పరిణామాలు దోహదపడ్డాయని తెలిపారు. “భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం అనే అత్యంత సానుకూల వార్త భారత మార్కెట్లకు ఊతమిచ్చింది” అని ఆయన అన్నారు.

మార్కెట్ వోలటిలిటీ – నిపుణుల అభిప్రాయం:

వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బాతిని మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. అమెరికా(America), చైనా(China) మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు బాగా పురోగమిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి అని బాతిని వివరించారు. మార్కెట్‌లో అస్థిరత కూడా గణనీయంగా తగ్గిందని, విక్స్ సూచీ ప్రస్తుతం నియంత్రణలో ఉంటూ 20 కంటే తక్కువగా ట్రేడ్ అవుతోందని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు కూడా ఎలాంటి ప్రతికూలతను ఇవ్వకపోవడం మార్కెట్ జోరును కొనసాగించడానికి సహాయపడిందని ఆయన తెలిపారు. ఈ సూచికలన్నీ భారత మార్కెట్లకు సానుకూల ఊపునిచ్చాయి, లాభాలు నిలకడగా కొనసాగుతున్నాయి అని బాతిని పేర్కొన్నారు.

Read also: Airtel: ఎయిర్‌టెల్ సంచలన నిర్ణయం.. 17 వేల కోట్ల డీల్..

#BullsAreBack #FinancialNews #IndiaStocks #InvestSmart #MarketRally #PeaceAndProfit #Sensex #ShareMarket #StockMarket Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.