దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ ఇచ్చాయి. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఐటీ రంగంలోని షేర్లలో కొనుగోళ్ల మద్దతు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం మార్కెట్లలో రికవరీకి సహాయపడింది. అయితే శుక్రవారం వెలువడే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయంపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటంతో లాభాలు పరిమితంగా ఉన్నాయి.
Read also: Harsha Goenka: అవసరమైన వస్తువులను మాత్రమే కొనండి: హర్ష గోయెంకా
Stock markets ended with gain
నిఫ్టీ మీడియా సూచీ 1.45 శాతం నష్టo
ట్రేడింగ్ ముగిసే సమయంలో సెన్సెక్స్ 158.5 పాయింట్లు పెరిగి 85,265.32 వద్ద స్థిరమైంది. నిఫ్టీ 47.75 పాయింట్లు లాభపడుతూ 26,033 వద్ద ముగిసింది. సెక్టార్ల వారీగా చూస్తే, నిఫ్టీ ఐటీ సూచీ అత్యధికంగా 1.4 శాతం లాభపడింది. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లు కూడా బలంగా నిలిచాయి. నిఫ్టీ మీడియా సూచీ 1.45 శాతం నష్టపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ & గ్యాస్ రంగాల్లో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలలో స్వల్ప నష్టాలు కనిపించాయి.
సెన్సెక్స్‌లో టీసీఎస్, భారత్ ఎలక్ట్రానిక్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభపడ్డాయి. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 28 పైసలు బలపడి 89.91 వద్ద ట్రేడ్ అయింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: