దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. తొలుత స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టిన స్టాక్ మార్కెట్లు (Stock Market) ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి
ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 190 పాయింట్ల నష్టంతో 81,599 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 73 పాయింట్ల నష్టంతో 24,873 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్‌ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్‌ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 73.44 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,399 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఆసియా మార్కెట్లు – మిశ్రమ ట్రెండ్
అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్ 1.52 శాతం, ఎస్ అండ్ పీ 500.. 0.94 శాతం, డోజోన్స్ 0.75 శాతం లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.50 శాతం లాభంతో ట్రేడవుతుండగా.. హాంగ్‌సెంగ్ 0.25 శాతం, షాంఘై 0.21 శాతం, ఆస్ట్రేలియన్ ఏఎస్‌ఎక్స్ 0.22 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.2,539 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIs) నికరంగా రూ.5,781 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.
మంగళవారం స్టాక్ మార్కెట్లు (Stock Market) ఫ్లాట్‌గా ప్రారంభమైనా, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు, ఆసియా మార్కెట్ల ప్రభావం మార్కెట్ దిశను నిర్ధారించనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం మేలుగా ఉంటుంది.
Read Also: Unemployment rate: 5.6 శాతానికి చేరిన నిరుద్యోగిత రేటు!