📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Stock Markets: వరుసగా రెండో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

Author Icon By Vanipushpa
Updated: July 10, 2025 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈరోజు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుసగా రెండో సెషన్‌లోనూ అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా కనిపించింది. అమెరికా-భారత్(America-India) మధ్య వాణిజ్య ఒప్పందం(Business Deal)పై నెలకొన్న సందిగ్ధత, కంపెనీల త్రైమాసిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు భారీ నష్టాలతో ముగియగా, నిఫ్టీ కీలకమైన 25,400 స్థాయిని కోల్పోయింది. ఉదయం 83,658 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex), ఆ జోరును నిలబెట్టుకోలేకపోయింది. కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 83,134 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయి, చివరికి 345 పాయింట్ల నష్టంతో 83,190 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ సైతం 120 పాయింట్లు కోల్పోయి 25,355 వద్ద ముగిసింది.

Stock Markets: వరుసగా రెండో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా నష్టపోయాయి

టీసీఎస్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా నష్టపోయాయి. అదేవిధంగా భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బీఈఎల్‌ షేర్లు సూచీల పతనానికి కారణమయ్యాయి. మరోవైపు మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ట్రెంట్ షేర్లు లాభపడిన వాటిలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 69.44 డాలర్లుగా ఉండగా, ఔన్సు బంగారం ధర 3,331 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.67 వద్ద కొనసాగుతోంది .

సాధారణ పదాలలో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి?
స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది?
సరళంగా చెప్పాలంటే, స్టాక్ మార్కెట్ అనేది ప్రజలు కంపెనీలలో యాజమాన్యం యొక్క వాటాలను కొనుగోలు చేసి విక్రయించే ప్రదేశం, దీనిని స్టాక్స్ అని పిలుస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Modi: 17 సార్లు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగంతో మోదీ ఘనత

#telugu News BSE sensex down Indian stock market Latest News Breaking News market loss NSE nifty fall share market update stock market decline Stock market news Stock Market Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.