దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల (Stock market) వరుస లాభాలకు బ్రేక్‌పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు మోస్తరు స్థాయిలో కదలాడాయి. చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. ఐటీ స్టాక్స్ రాణించాయి. సెన్సెక్స్ (Sensex) ఉదయం 82,643.73 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,445.21) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా 82,240.40- 82,680.79 పాయింట్ల మధ్య ఓ మోస్తరు శ్రేణిలో కదలాడింది. చివరికి సెన్సెక్స్ 53.49 పాయింట్ల నష్టంతో 82,391.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty) ఒక పాయింట్ లాభంతో 25,104.25 వద్ద ముగిసింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 85.62గా ఉంది. టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో మగిశాయి. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 67.33 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ఔన్సు 3,350 డాలర్ల వద్ద ట్రేడయింది.