📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ వందే భారత్ స్లీపర్ ప్రారంభం రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Author Icon By Rajitha
Updated: January 22, 2026 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి, మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 397.74 పాయింట్లు పెరిగి 82,307.37 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 132.4 పాయింట్ల లాభంతో 25,289.9 వద్ద ముగిసింది. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల తగ్గుదల ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. పీఎస్‌యూ బ్యాంక్, మీడియా రంగాల షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా కనిపించాయి.

Read also: RBI: నకిలీ నోట్లపై అలర్ట్.. అసలు, నకిలీ తేడాలు తెలుసుకోండి

stock markets closed with gains

సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగింపు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఫిబ్రవరి 1 నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలపై టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించడం మార్కెట్లకు మిక్స్ రియాక్షన్ ఇచ్చింది. అదనంగా, గ్రీన్‌లాండ్‌పై నాటోతో భవిష్యత్ ఒప్పందానికి ఫ్రేమ్‌వర్క్ కుదిరిన సంగతి, భారత్‌తో పెద్ద వాణిజ్య ఒప్పందం వచ్చే అవకాశం, మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి.

అంతర్జాతీయ సానుకూల పరిణామాలు

బీఎస్ఈలో అదానీ పోర్ట్స్, బీఈఎల్, ఎస్బీఐ, టాటా స్టీల్ వంటి హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు అయ్యాయి. అయితే, ఇటర్నల్, టైటాన్, మారుతీ సుజుకీ, నష్టంతో ముగిశాయి. రంగాల వారీగా చూసినప్పుడు, నిఫ్టీ రియల్టీ, కన్జూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాలు లాభాలతో ముగిశాయి.

మార్కెట్ నిపుణుల ప్రకారం, నిఫ్టీ 25,120 స్థాయికి పైన నిలిచితే, 25,400–25,500 వైపు స్థిరమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. కానీ, 25,120 స్థాయిని కోల్పోతే అమ్మకాల ఒత్తిడి పెరిగి 25,100 దిశగా పడిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్లలో కూడా లాభాల ధోరణి కొనసాగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Media Stocks Nifty PSU Bank sensex Telugu News tock Market

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.