దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. వారాంతంలో సానుకూల సంకేతాలు కనిపించడంతో సూచీలు పాజిటివ్‌గా కదిలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (sensex) 187 పాయింట్లు పెరిగి 83,570 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 25,694 వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్ సమయంలో సూచీలు తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఇంట్రాడే గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో చివర్లో స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి.
Read also: High Rates: ఆ దేశంలో ఏకంగా 682% ద్రవ్యోల్బణం!..కొత్త రిపోర్ట్
stock markets closed with gains
ఐటీ, బ్యాంకింగ్ షేర్ల జోరు
ఉదయం నిఫ్టీ దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమైంది. డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించడంతో ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్లు నమోదయ్యాయి. టెక్నాలజీపై వ్యయాలు పెరుగుతాయన్న అంచనాలు ఈ ర్యాలీకి బలం చేకూర్చాయి. ఫలితంగా నిఫ్టీ ఇంట్రాడేలో 25,873 గరిష్ఠ స్థాయిని తాకింది. బ్యాంకింగ్ రంగంలోనూ ఆస్తుల నాణ్యత మెరుగుపడుతుందన్న అంచనాలతో కొనుగోళ్ల మద్దతు లభించింది.
రంగాల ప్రదర్శన, మార్కెట్ అంచనాలు
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.34 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.84 శాతం లాభపడి 60,082కి చేరింది. మరోవైపు ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా స్వల్పంగా తగ్గాయి. ముందున్న రోజుల్లో కంపెనీల త్రైమాసిక ఫలితాల ఆధారంగా స్టాక్ స్పెసిఫిక్ కదలికలు కనిపించవచ్చని, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: